కరోనా సోకిందని భార్యాపిల్లల్ని వదిలించుకుని ప్రియురాలితో కాపురం..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రియురాలి మోజులో పడ్డలో పడి పండంటి బిడ్డను..భార్యను వదిలించుకోవాలనుకున్నో భర్త.నాకు కరోనా సోకింది..ఇక బతకనని డాక్టర్లు చెప్పారు..ఇటువంటి పరిస్థితుల్లో నేను ఇంటికి రాను..ఎక్కడోకచోట కాలంవెళ్లబుచ్చి చచ్చిపోతాను..నా కోసం వెతకొద్దు..నా కోసం చూడద్దు అంటూ భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. పక్కా ప్లాన్డ్‌గా ఐడెంటీని మార్చుకుని ప్రియురాలితో కలిసి కాపురం పెట్టి..ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక తాను తన ప్రియురాలితో కలిసి హాయిగా ఉండొచ్చని కలలు కన్నాడు.

మరో పక్క అతని భార్య భర్త పరిస్థితి విని కన్నీరు మున్నీరు అయింది. కరోనా కారణంగా ఎందరో దిక్కులేని చావులు చస్తున్నారు కాబట్టి తన భర్త కూడా అలాగే పోయాడనుకుని ఆమె రాత్రింబవళ్లు ఏడుస్తూనే ఉంది. భర్త కోసం పరితపిస్తూ ఏడుస్తూనే ఉంది.

వివరాల్లోకి వెళితే..ముంబైలోని తలోజా ప్రాంతానికి చెందిన 28 ఏళ్లఓ ప్రైవేటు కంపెనీలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్న మనీశ్ మిశ్రాకు వివాహం అయ్యింది. ఐదేళ్ల పాపకూడా ఉంది. ఈ క్రమంలో మనీశ్ కు మరో యువతిని ప్రేమించాడు. ఆమెతో కలిసి ఉండటానికి..ఆమెను పెళ్లి చేసుకోవటానికి అడ్డుగా ఉన్న భార్యను వదిలించుకోవాలనుకున్నాడు.


కరోనా కాలాన్ని వాడేసుకోవాలనుకున్నాడు. ఇంకేముందు ఓ ఐడియా వచ్చింది. భార్యకు ఫోన్ చేసి..‘నాకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. త్వరలోనే నేను చచ్చిపోతాను’ నేను ఇంటికి రాను ఎక్కడోకచోట చచ్చిపోతాను..నాకోసం బాధపడొద్దంటూ చిలకపలుకులు పలికాడు. ఆ మాట విని ఆమె అక్కడే కుప్పకూలింది. రాత్రింబవళ్లు ఏడుస్తూనే ఉంది. ఆ తర్వాత ఆమె భర్తకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్‌ వస్తోంది. దీంతో అతనికేమైందోననని ఒకటే ఆందోళనపడిపోయింది.


నా భర్తను ఎలాగైనా తీసుకురా అన్నయ్యా..ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాసరే..ఆయన మాత్రం ఇంటికి రావాలంటూ తోడబుడ్డినవాడి దగ్గర కుమిలిపోయింది. దీంతో ఆమె పుట్టింటివారు..బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేసి మనీశ్ కోసం వెతుకటం ప్రారంభించారు. ఈ క్రమంలో ఇతర వస్తువులు లభించాయి. ఆ పక్కనే ఓ సరస్సు ఉండటంతో, అతను అందులో దూకి ఉండవచ్చని భావించిన పోలీసులు, జాలర్ల సాయంతో తనిఖీలు జరిపించారు. ఎన్ని రోజులు వెతికించినా, మృతదేహం ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో అతను బతికే ఉండవచ్చని నమ్మిన పోలీసులు, మరో మార్గంలో విచారణ చేపట్టారు.


మనీశ్ బైక్,ఇతర వస్తువులు లభించాయి. ఆ పక్కనే ఓ సరస్సు ఉండటంతో..కరోనా సోకిందనే మనస్తాపంతో మనీశ్ అందులో దూకి ఉండవచ్చని భావించిన పోలీసులు..జాలర్లతో సరస్సుని గాలించారు. కానీ ఎన్ని రోజులు వెతికించినా..మనీశ్ మృతదేహం ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో అతను బతికే ఉండవచ్చని నమ్మిన పోలీసులు.., మరో మార్గంలో విచారణ చేపట్టారు.


ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను అన్నింటినీ జల్లెడ పట్టడం ప్రారంభించారు. చాలా రోజుల తరువాత వారి ప్రయత్నం ఫలించింది. మనీశ్ మిశ్రా ఓ మహిళతో కలిసి కారులో వెళుతున్నట్టు గుర్తించి..అతని గత చరిత్రపై విచారించగా..ఓ మహిళతో వివాహేతర బంధం ఉన్నట్టు..ఇద్దరూ కలిసి ఇండోర్ లో కాపురం పెట్టారని తేలింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని, ముంబైకి తీసుకుని వచ్చి, భార్య ముందు నిలిపారు. కౌన్సెలింగ్ ఇచ్చి అతని కుటుంబానికి అప్పగించారు.

READ  మూడేళ్ల బాలిక అత్యాచారం..హత్య నిందితుడ్ని ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు

Related Posts