లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime News

12 ఏళ్ల కూతుర్ని పెన్సిల్ తో పొడిచి..కొరికి హింసించిన తల్లి..మా అక్కను కాపాడమంటూ ఫోన్ చేసిన చెల్లి

Published

on

Mumbai mother stabs 12 years old daughter Attack with pencil : పిల్లలు చదువుకోకపోతే రెండు దెబ్బలేసి భయం చెబుతాం.అంతేకాని రక్తం వచ్చేలా ఏ తల్లీ కొట్టదు. కానీ ఓ తల్లి మాత్రం ఆన్‌లైన్‌ క్లాసులు వినట్లేదని తన 12 ఏళ్ల కూతుర్ని చిత్రహింసలు పెట్టింది. షార్పుగా ఉండే పెన్సిల్ తో ఇష్టమొచ్చినట్లుగా పొడిచింది. బాధతో కూతురు ఏడుస్తున్నా ఆ తల్లికి జాలి కలగలేదు. సరికదా..పళ్లతో కొరికేసి గాయపరిచింది.


గాయాల బాధతో అక్కడ ఏడుస్తుంటే చూసిన చెల్లెలు తట్టుకోలేకపోయింది. వెంటనే ఛైల్డ్ వెల్ఫేర్ వాళ్లకు ఫోన్ చేసి ‘‘మా అమ్మ మా అక్కను కొడుతోంది..పెన్సిల్ తో పొడిచి గాయపరిచింది..మా అక్క ఏడుస్తోంది..దయచేసి మా అక్కను కాపాడండీ’’ అంటూ ఛైల్డ్ హెల్ప్ లైన్ కు ఫోన్ చేసిన ఘటన బుధవారం (అక్టోబర్ 21,2020) ముంబైలో చోటుచేసుకుంది.


వరదలో చిక్కుకున్న కారు..కొట్టుకపోయిన తండ్రి, కూతురు


వివరాల్లోకి వెళితే..ముంబైలోని శాంతాక్రజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ తల్లి తన 12ఏళ్ల కూతురు ఆన్ లైన్ క్లాసులు సరిగా వినట్లేదని ఆగ్రహం వ్యక్తంచేసింది. పాఠాలు సరిగా వినకపోతే ఎలా టీచర్లు చెప్పింది వినాలి..వారు అడిగినదారికి జవాబులు ఇవ్వకుండా రాయిలా కూర్చుంటావేంటీ? అంటూ తిట్టింది. ఆన్ లైన్ లో క్లాసులు చెప్పే టీచర్ఆ పాపని కొన్ని ప్రశ్నలు వేసింది. దానికి పాప ఆన్సర్ ఇవ్వకుండా అలాగే చూస్తుండిపోయింది తప్ప పెదవి విప్పలేదు. దీంతో అక్కడే ఉన్న ఆమె తల్లికి చిర్రెత్తిపోయింది.


టీచర్ అడిగినదానికి సమాధానం చెప్పవేంటీ అంటూ గద్దించింది. దీంతో ఆ పాప మరింతగా బెదిరిపోయింది. బిక్కమొహం వేసుకుని అలాగే కూర్చుండిపోయింది. దీంతో కూతురిపై కోపం తీవ్రస్థాయికి చేరుకోవటంతో ఆ తల్లి కూతుర్ని షార్పుగా ఉండే ఓ పెన్సిల్ తో వీపుపై పదే పదే పొడిచింది. అలా ఒకటీ రెండు సార్లు కాదు ఏకంగా 12సార్లు పొడిచింది. అక్కడికి ఆమె కోపం తీరక..పళ్లతో ఇష్టమొచ్చినట్లుగా కొరికింది.


దీంతో ఆ బాలికకు గాయాలయ్యాయి. బాధతో కూతురు ఏడుస్తుంటే చూసిన చిన్నకూతురు వెంటనే చైల్డ్‌ హెల్‌‍్పలైన్‌ నంబరుకు ఫోన్‌చేసి విషయం చెప్పింది. ఎన్జీవో సభ్యులు కొంతమంది బాధిత బాలిక ఇంటికి చేరుకుని..తల్లిని నిలదీశారు. చిన్న పిల్ల అని కూడా చూడకుండా ఇంతలా గాయపరుస్తారా? అంటూ ప్రశ్నించారు.దానికి ఆమె మరింత కోపంగా..‘‘నా కూతురు నా ఇష్టం మీకెందుకు మధ్యలో..మీరెవరు నన్ను ప్రశ్నించడానికి’’ అంటూ అంతెత్తున ఎగిరిపడింది. ‘‘నేను ఇలాగే ఉంటాను..చదువుకోకపోతే కొట్టకుండా ముద్దు పెట్టుకుంటారా?’’ అంటూ ఎదురు ప్రశ్నించింది. నన్ను ప్రశ్నించే హక్కు మీకు లేదు..ఇక్కడ నుంచి వెళ్లిపోండి అంటూ ఎగిరిపడింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా..ఈ ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *