లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Health

మహిళానిర్మాత పెద్దమనస్సు: 42వేల లీటర్ల చనుబాలు దానం చేసి..60 మంది పసికందుల ఆకలి తీర్చిన అమ్మ

Published

on

Mumbai mother donates 42 litres breast milk : శిశువులకు తల్లిపాలు అమృతంతో సమానం. రోగనిరోధక శక్తిని పెంచే అమ్మపాలు బిడ్డకు చాలా చాలా అవసరం. అమ్మపాలుతాగిన పిల్లలకు ఎటువంటి వ్యాధులు త్వరగారావని నిపుణులు చెబుతుంటారు. కానీ బిడ్డల్ని ప్రసవించిన కొంతమంది తల్లులందరికి చనుబాలు సరిగా ఉండవు. దీంతో బిడ్డలకు తల్లిపాలు సరిపోవు.కానీ కొంతమంది తల్లులకు పుష్కలంగా పాలు ఉంటాయి. వారి బిడ్డలు తాగిన ఇంకా పుష్కలంగా ఉంటాయి.అమ్మపాలు తాగే భాగ్యంలేని బిడ్డలకోసమే ‘‘అమ్మపాల’’బ్యాంకులు ఏర్పడ్డాయి. చాలామంది తల్లులు తమ పాలను దానంచేస్తుంటారు. ఆ పాలనుతల్లిపాలకు నోచుకోని బిడ్డలకు తాగించి వారి ఆకలి తీరుస్తారు. అమ్మపాలలో ఉండే ఔషధాలు బిడ్డల ఆరోగ్యానికి చాలా చాలా అవసరం.చాలామంది అమ్మలు తమ పాలను దానం చేస్తుంటారు. అటువంటివారిలో చాలా ప్రత్యేకమైన అమ్మ ప్రముఖ నటి తాప్సీ నటించిన హిందీ సినిమా నిర్మాత ‘‘నిధి పార్మర్ హీరానందా’’ తన పాలను విరివిగా దానం చేస్తున్నారు.ఆమె ఇప్పటి వరకూ 42 లీటర్ల చనుపాలను దానం చేసింది. ‘సాంద్ కీ ఆంఖ్’ సినిమా ప్రొడ్యూసర్ నిధి పార్మర్ హీరానందాని ఇటీవలే తల్లి అయింది. తల్లి అయిన వారందరికీ వచ్చినట్లే ఆమెకు కూడా చనుబాలు వచ్చాయి. అయితే వాటిని తన పిల్లాడికి మాత్రమే కాకుండా ఇంకొంతమంది పసిబిడ్డల కడుపు నింపాలని అనుకుంది. దీంతో ఆమె చనుబాలను ఓ ఆస్పత్రికి దానమిచ్చిందామె. అలా గత 2020 మే నెల నుంచి ఇప్పటి వరకూ దాదాపు 42 లీటర్ల పాలు దానం చేసిందా అమ్మ.నిధి వయసు 42. ఈ వయసులో తల్లి అవడమే కష్టం. అటువంటిది ఆమె తల్లి కావటం ఓ విశేషమైతే..ఆమె తల్లి అయ్యాక పుష్కలంగా వచ్చిన తన చనుబాలను దానం చేసిన గొప్ప మహిళ కూడా అయ్యారామె. ఏకంగా 42 లీటర్ల చనుబాలు దానం చేయడంతో నిధి వార్తల్లో గొప్ప మహిళగా నిలిచారు.నిర్మాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం


ఈ సందర్భంగా నిథి మాట్లాడుతూ..తన బిడ్డ బొజ్జనిండా పాలు తాగుతున్నాడనీ..తన బిడ్డ మాత్రమే కాకుండా ఎక్కువగా ఉన్నాయని అవి మరింతమంది పసిబిడ్డల బొజ్జలు నింపాలనుకున్నానని అందుకే తన పాలను దానం చేస్తున్నానని తెలిపారు. తన బిడ్డ తాగగా ఇంకా పాలు తనవద్ద పుష్కలంగా ఉన్నవాటిని సద్వినియోగం చేయాలనుకున్నానని తెలిపారు.తను తరచూ పాలు తీసి దానం చేస్తున్నాగానీ తనకు ఇంకా ఎక్కువగా పాలు పడుతున్నాయని అది అమ్మపాలుఅవసరం అయిన బిడ్డల కోసం ఇస్తున్నానని తెలిపారు.


ఆమె పాలు దానం చేయాలని ఆలోచన వచ్చిన తరువాత తాను ఓ ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడిందామె. తన చనుబాలను దానం ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పిందట. అక్కడి డాక్టర్లు చాలా సంతోషపడ్డారు. దానికి డాక్టర్లు ఇచ్చిన సహాలు పాటిస్తూ. తీసిన పాలు పాడవ్వకుండా…అన్ని జాగ్రత్తలు తీసుకొని చనుబాలను దానం చేసింది. ఇది మే నెలలో మొదలైందని, అప్పటి నుంచి ఇప్పటివ వరకూ అంటే 6 నెలల నుంచి దాదాపు 42 లీటర్ల పాలు దానం చేశానని నిధి తెలిపింది.


అలా తాను దానం చేసిన పాలను ఆ ఆస్పత్రి వారు ఏంచేస్తున్నారో తెలుసుకోవాలనుకున్నాడు. నిజంగా తాను అనుకున్నది జరుగుతోంది. పసిబిడ్డల కడుపులునిండుతున్నాయా? అని తెలుసుకోవాలనుకుంది నిధి. వాటిని ఎవరు ఉపయోగిస్తున్నారు? ఎలా ఉపయోగిస్తున్నారు? అని తెలుసుకోవాలని ఆమెకు అనిపించిందట. ఆస్పత్రి వాళ్లతో మాట్లాడి
తన పాలు ఎలా ఉపయోగిస్తున్నారో చూపించాలని కోరింది.


దానికి వాళ్లు కూడా స్పందించి..ఆమెను ఓసారి ఆస్పత్రికి రమ్మన్నారు. అక్కడకు వెళ్లిన ఆమెకు ఓ 60 మంది పసికందులను చూపించారు. వారందరికీ నిధి ఇచ్చిన పాలే పడుతున్నట్లు చెప్పారు. ఆ మాట వినగానే తనకెంతో సంతోషం కలిగిందని నిధి చెప్పింది. తన చనుబాలు తాగుతున్న పిల్లలందరికీ ఆ పాలు చాలా అవసరమని, వారికోసం తాను మరో ఏడాదిపాటు పాలు దానం చేస్తూనే ఉంటానని నిధి సంతోషంగా చెప్పింది.తన పాలతో అంతమంది పసివాళ్ల ఆకలి తీర్చుస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉందని తెలిపింది.


నిధిని స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది ఇలా చనుబాలు దానం చేస్తే అవసరంలో ఉన్న చాలా మంది పిల్లలకు ఉపయోగ పడతాయని నిపుణులు అంటున్నారు. అది కూడా ప్రతి తల్లీ తన
బిడ్డకే ప్రాధాన్యం ఇవ్వాలని..కానీ డాక్టర్ల సలహాలతో అమ్మపాలను వృధా కానివ్వకుండా మిగిలిన అమ్మపాలను దానం చేయడం దానం చేసిన తల్లికి కూడా చాలా మంచిదని తెలిపారు. ఇలా చేయడం వల్ల చాలా మంది పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినవారవుతారని చెబుతున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *