Home » పెళ్లి పేరుతో టీవీ నటిపై అత్యాచారం…డైరెక్టర్ పై కేసు నమోదు
Published
2 months agoon
By
murthyTV actress accuses casting director of rape, FIR filed : పెళ్ళి పేరుతో తనపై లైంగిక దాడి చేసిన కాస్టింగ్ డెరెక్ట్రర్ పై ముంబై లో ఓ టీవీ నటి వెర్సోవా పోలీసులకు ఫిర్యాదు చేసింది. టీవీ సీరియల్స్ లో నటించే ఒక నటితో(26) ఆయుష్ తివారీ అనే కాస్టింగ్ డైరెక్టర్ రెండేళ్లుగా ప్రేమాయణం సాగించాడు. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. ఈ సమయంలో వారిద్దరూ పలు మార్లు సన్నిహితంగా కలిశారు.
ఈ క్రమంలో టీవీ నటి గత కొద్దిరోజులుగా పెళ్లి చేసుకోమని తివారీని కోరింది. దానికి అతడు సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరగటంతో ఆ నటి మోసపోయానని తెలుసుకుంది. దీంతో నవంబర్ 26న వెర్సోవా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయుష్ తివారీమీద ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడిని ఇంకా అదుపులోకి తీసుకోలేదని వెర్సోవా సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ రాఘ్వేంద్ర ఠాకూర్ తెలిపారు.