లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

కారులో వెళుతున్న ఫ్యామిలీతో అసభ్యంగా ప్రవర్తించిన యువకులు – కేసు నమోదు

Published

on

Woman, her family harassed by two bike-borne miscreants on Western Express Highway, video goes viral : ముంబై లోని వెస్ట్రన్ ఎక్స్ ప్రెస్ హైవే పై కారులో వెళుతున్న కుటుంబాన్ని అశ్లీల హావభావాలతో వేధించిన యువకులపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. నిందితులిద్దరూ నెంబర్ ప్లేటు లేని  స్కూటర్ పై కారుకు అడ్డం వస్తూ, కారులోని అక్కా చెల్లెళ్లను వేధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జనవరి 14 గురువారం రాత్రి ముంబై వెస్ట్రన్ ఎక్స్ ప్రెస్ హైవే లో ఒక కుటుంబం బాంద్రా వైపు కారులో వెళుతోంది. తండ్రి కారు నడుపుతుండగా, వెనక సీట్లో అతని కుమార్తెలు కూర్చున్నారు. ఆ సమయంలో మద్యం సేవించి నెంబరు ప్లేటు లేని  స్కూటర్ పై ఇద్దరు యువకులు కూడా ఆ హైవే పై ప్రయాణిస్తున్నారు. కారులోని యువతులను చూసిన యువకులు కారు ప్రయాణానికి ఇబ్బంది కలిగించేలా కారు ముందు తమ స్కూటర్ ను అడ్డదిడ్డంగా నడుపుతూ ఇబ్బంది కలిగించారు.

కొంత దూరం వెళ్లాక సైడ్ ఇచ్చి అసభ్యకరమైన చేష్టలు, హావభావాలతో యువతులను వేధించారు. ఈ తతంగాన్నంతా వెనుక ఇంకో కారులో వస్తున్న యువతి తన సెల్ ఫోన్ లో వీడియో తీసి, ముంబై పోలీసు కమీషనర్ కు ట్యాగ్ చేస్తూ తన
ట్విట్టర్ ఎకౌంట్లో పోస్ట్ చేసింది. ఎక్స్ ప్రెస్ హైవేలోని సీసీటీవీ ఫుటేజిని పరిశీలిస్తున్నామని త్వరలోనే నిందితులను పట్టకుంటామని పోలీసులు తెలిపారు.