లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime Stories

పగబట్టిన పడుచు : సోదరుడిని చంపిన వ్యక్తిని చంపటానికి హనీట్రాప్..! అడ్డంగా బుక్ అయిన నిందితుడు!!

Published

on

Mumbai woman honey traps brother killer : ప్రాణానికి ప్రాణం అనే పగ,ప్రతీకారాలను సినిమాల్లో చూస్తుంటాం. కానీ..మహారాష్ట్రంలో ఓ యువతి తన సోదరుడ్ని చంపినవాడిని చంపి తీరాలని అతనిపై ‘వలపు వల’విసిరింది. అందమైన అమ్మాయి పైగా వయస్సులో ఉన్న అమ్మాయి వలపు వల విసిరితే ఏ మగాడైనా పడకుండా ఉంటాడా? సదరు వ్యక్తి కూడా ఆ యువతి ‘హనీ ట్రాప్’లో పడ్డాడు.చేతికి అందివచ్చాడు. ఇక వాడిని అంతమొందిచి తన సోదరుడి హత్యకు ప్రతీకారం తీర్చోకోవాలనుకుంది. దీనికి పక్కాగా ప్లాన్ కూడా వేసింది. చేతికి అందివచ్చినవాడిని ఆ ‘పగబట్టిన పడుచు’చంపిందో లేదో ఈ రియల్ స్టోరీలో తెలుసుకుందాం..

హత్యకు దారి తీసిన పార్కింగ్ గొడవ
2020 జూన్‌లో ముంబైలోని మలాడ్ ప్రాంతంలో పార్కింగ్ విషయంలో రెండు గ్రూపుల మధ్య గొడవ మొదలైంది. ఆ గొడవకాస్తా ఘర్షణకు దారి తీసింది. ఇరు వర్గాలు రెచ్చిపోయాయి. ఈ క్రమంలో ఈ ఘర్షణ కాస్తా హత్య చేసేవరకూ వెళ్లింది. అల్తాఫ్ షేక్ అనే 24 ఏళ్ల యువకుడిని మహ్మద్ సాధిక్ అనే వ్యక్తి హత్య చేశాడు. ఈ హత్య తర్వాత సాధిక్ భయపడి ఢిల్లీ నుంచి పారిపోయాడు. ఈ ఘటనతో అల్తాఫ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అల్తాఫ్ మరణంతో అతని సోదరి యాస్మిన్ షాక్‌లోకి వెళ్లిపోయింది. సోదరుడంటే ఎంతో ప్రేమ కలిగిన యాస్మిన్ తన సోదరుడిని హత్య చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. అదేదో ఆవేశంతో తీసుకున్న నిర్ణయం కాదని ఆమె తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసిన విధానాన్ని సాధికర్ ను చంపటానికి ఆమె వేసిన పక్కా ప్లాన్ చూస్తే తెలుస్తుంది. సాధిక్ ను అంతమొందించటానికి సోదరుడు అల్తాఫ్ స్నేహితులు సహాయం తీసుకుంది.

సోదరుడి స్నేహితులతో కలిసి పక్కా ప్లాన్
అల్తాఫ్ ఫ్రెండ్స్‌ ఫరూఖ్ షేక్(20), ఒవైస్ షేక్(18), మనీస్ సయ్యద్(20), జకీర్ ఖాన్(32), సత్యం పాండే(23)లతో కలిసి సాధిక్‌ను అంతమొందించాలని నిర్ణయం తీసుకుంది. అల్తాఫ్ హత్య జరిగిన సరిగ్గా నెల రోజుల తర్వాత యాస్మిన్..మల్వానీ ప్రాంతంలో అల్తాఫ్ ఫ్రెండ్‌ను కలిసి సాధిక్‌ను చంపేందుకు ప్లాన్ సిద్దం చేసింది. ఆ విషయాన్ని వివరించింది.

కిల్లర్ ను రప్పించటానికి హాని ట్రాప్ లో ‘ఫస్ట్ స్టెప్’ గా ..సోషల్ మీడియాలో చాటింగ్
దీంట్లో భాగంగా ‘ఫస్ట్ స్టెప్’ గా ఢిల్లీనుంచి పారిపోయినవాడికి తిరిగి రప్పించటానికి వాడారు. దాని కోసం సాధిక్ ను హాని ట్రాప్ చేయాలని డిసైడ్ అయ్యారు. దీని కోసం అల్తాఫ్ సోదరి యాస్మిన్ ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసింది. ఆ అకౌంట్ నుంచి సాధిక్‌తో చాటింగ్ చేయడం ప్రారంభించింది.

యాస్మిన్ ప్రేమలో పడ్డ కిల్లర్ ..సెకండ్ స్టెప్ గా ముంబై వచ్చిన సాధిక్
అది తనను చంపటానికి వేసి హాని ట్రాప్ అని తెలియని సాధిక్..యాస్మిన్ చాటింగ్ ద్వారా చేసిన చాటింగ్ ప్రేమలో బొక్క బోర్లా పడిపోయాడు. అమ్మాయితో చాటింగ్ అంటే మరి అబ్బాయిలకు ఒళ్లూపై తెలీదు కదా..అలా యాస్మిన్ హానీ ట్రాప్ లో చిక్కుకున్నాడు సాధిక్..చాటింగ్ లో ఎన్నో విషయాలు చెప్పుకునేవారు. ఈక్రమంలో తన సోషల్ మీడియా ప్రియురాలు యాస్మిన్ సాధిక్ తనను పూర్తిగా నమ్మాడని నమ్మకం ఏర్పడ్డాక..‘సెకండ్ స్టెప్’ ను ఉపయోగించింది. నిన్ను చూడాలని ఉందని యాస్మిన్ కోరటంతో సాధిక్ ఆమెను కలవటానికి ముంబై వచ్చాడు. ఆ తరువాత యాస్మిన్ సాధిక్ కు ఫోన్ చేసి గత శనివారం (జనవరి9,2021) కశ్మీర్ లోని ఓ ప్రాంతం పేరు చెప్పి అక్కడకు రమ్మని కోరింది. అసలే చలి..పైగా ప్రేయసి రమ్మంటే రాకుండా ఉంటాడా..ఎన్నెన్నో ఊహించుకున్న సాధిక్ రెక్కలు కట్టుకుని కశ్మీర్ లో వాలిపోయాడు.

థర్డ్ స్టెప్ లో కశ్మీర్ వచ్చిన సాధిక్ ..కిడ్నాప్
‘మూడో స్టెప్’ లో భాగంగా యాస్మిన్ కు బదులుగా కశ్మీర్ కు అల్తాఫ్ ఐదుగురు స్నేహితులు చేరుకున్నారు. వారు సాధిక్ రాక కోసం అంబులెన్స్‌లో ఎదురు చూస్తూ కూర్చున్నారు. వారి ఎదురుచూపులు ఫలించాయి. గురుడు సాధిక్ యాస్మిన్ చెప్పినచోటికి చేరుకున్నాడు. దీంతో అల్తాఫ్ స్నేహితులు అలెర్ట్ అయి..సాధిక్‌ను అంబులెన్స్‌లో ఎక్కించి రయ్ మంటూ లాగించేశారు. అలా సాధిక్ ను కిడ్నాప్ చేసి.. అతడిని వాసాయి నైగాన్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేయాలని అనుకున్నారు. కానీ వాళ్లు పక్కాగా వేసిన ప్లాన్ బెడిసికొట్టింది. సాధిన్ ను హత్య చేయలేకపోయారు.

ఇంత పక్కాగా వేసిన ప్లాన్ ఎలా బెడిసి కొట్టిందంటే..
యాస్మిన్ చెప్పిన ప్రాంతానికి సాధిక్‌ వచ్చిన వెంటనే అల్తాఫ్ స్నేహితులు సాధిక్ ను బలవంతంగా అంబులెన్స్‌లో ఎక్కించడం కశ్మీర్ ప్రాంతంలోని స్థానికులు గమనించారు. దీంతో వాళ్లు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన నార్త్ రీజియన్ పోలీసులు అంబులెన్స్‌ను ట్రెస్ చేసే పనిలో పడ్డారు.

అలా ట్రేస్ చేసే యత్నంలో బిజీ అయ్యారు. ఈ క్రమంలో సాధిక్ ను కిడ్నాప్ చేసిన అంబులెన్స్‌లో పెట్రోలు అయిపోవడంతో వారు మరో కారును అద్దెకు తీసుకున్నారు. ఆ కారులో వారు వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే వైపు బయలుదేరారు. ఆ మార్గంలో అప్పటికే వీరిపై సమాచారం ఉన్న పోలీసులు కాచుకుని కూర్చోవటం అంబులెన్స్ తో సహా వారిని అందరినీ పట్టుకుని సాధిక్‌ను వారినుంచి రక్షించారు.

హనీ ట్రాప్ గురించి తెలిసి షాక్ అయిన పోలీసులు
అల్తాఫ్ స్నేహితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని తమదైన శైలిలో విచారించగా..అసలు విషయం బైటపడింది. దీంతో యాస్మిన్‌తో పాటు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అల్తాఫ్ హత్య కేసులోనిందితుడిగా ఉన్న సాధిక్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో యాస్మిన్ వేసిన ప్లాన్ తెలుసుకుని పోలీసులు సైతం షాక్ అయ్యారు. ఓ ఆడది తలచుకుంటే ఎంతకైనా తెగిస్తుందని తెలుసుకున్న పోలీసులు సోదరుడి స్నేహితులతో కలిసి తన అన్నను చంపిన వ్యక్తిని ఎలా హాని ట్రాప్ ద్వారా రప్పించిందో తెలుసుకుని అవాక్కయ్యారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *