బాలీవుడ్ నటుడి కుమార్తెను బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తి అరెస్ట్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రముఖ బాలీవుడ్ నటుడి కుమార్తెను బ్లాక్ మెయిల్ చేస్తున్న 25 ఏళ్ల యువకుడిని ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. బాలీవుడ్ కు చెందిన ఓ 60 ఏళ్ల స్టార్ నటుడి కుమార్తెకు సంబంధించిన అశ్లీల చిత్రాలను ఇన్ స్ట్రాగ్రాం ద్వారా సేకరించి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని యువకుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు బాధిత యువతి ఫిర్యాదు లో పేర్కోంది.ఫిర్యాదు స్వీకరించిన క్రైం బ్రాంచ్ పోలీసులు నిందితుడు బాంద్రా కార్టర్ రోడ్డులో నివాసం ఉంటున్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడి సోదరి బాధితురాలు ఒకే కాలేజీలో చదివినట్లు సమాచారం.

బాధితురాలుకు చెందిన వీడియోను బహిర్గతం చేస్తానని, డబ్బు డిమాండ్ చేయటంతో ఆమెఫిర్యాదు చేసినట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ యూనిట్ 11కు చెందిన సీనియర్ పోలీస్ ఇన్స్‌పెక్టర్‌ చిమాజీ ఆధవ్ తెలిపారు. నిందితుడు బాధితురాలి ఇన్ స్టా గ్రాం నుండి ఫోటోలు సేకరించి, డబ్బులు ఇవ్వకపోతే వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని బెదిరించినట్లు పోలీసులు చెప్పారు.

Related Posts