ముంబైలో భారీ పవర్ కట్.. ఇది హ్యాకర్ల పనేనంట!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Mumbai’s massive power cut : ముంబైలో భారీ కరెంట్ కట్ నగరమంతా ఉలిక్కిపడింది. ఒక రోజుంతా కరెంట్ పోయింది. ఎప్పటిలానే పోయి ఉంటుందిలే అనుకున్నారంతా.. కానీ, కరెంట్ కట్ వెనుక హ్యాకర్ల హస్తం ఉందని తెలిసి అంతా షాకయ్యారు.అక్టోబర్ 12న దాదాపు ముంబైలో రోజుంతా కరెంట్ లేదు. దాంతో స్టాక్ ఎక్సేంజర్లు, మెడికల్ ఫెసిలిటీస్, ఇతర కీలక మౌలిక నిర్మాణ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడింది. ఈ ఘటనపై రాష్ట్ర పోలీసు సైబర్ సెల్ దర్యాప్తు చేసింది.

స్టేట్ స్పాన్సర్డ్ హ్యాకర్లు కరెంట్ కట్ అసలు కారణమని రివీల్ చేసినట్టు ఓ నివేదిక వెల్లడించింది. నెలపాటు సాగిన సుదీర్ఘ దర్యాప్తులో సప్లయ్, ట్రాన్స్‌మిషన్ యూటిలీటీ సర్వర్లలో అనుమానాస్పదంగా మల్టీపుల్ లాగిన్ అయినట్టు గుర్తించారు.ఇందులో సింగపూర్ సహా ఏసియన్ దేశాలే ఎక్కువగా ఉన్నాయి. భారతీయ ఆర్థిక రాజధానిని కుంగదీసే ప్రయత్నమైనా జరిగిందా అనే కోణంలో ప్రస్తుతం సైబర్ సెల్ దర్యాప్తు కొనసాగిస్తోంది.

CYFIRMA రిపోర్టు ప్రకారం.. భారతదేశంలో కనీసం నాలుగు వేర్వేరు రాష్ట్రాల స్పాన్సర్డ్ హ్యాకింగ్ గ్రూపులు ఉన్నాయని వెల్లడించింది. ఇందులో మిషన్ 2025, Apt36, Apt36, స్టోన్ పాండా, లాజరస్ గ్రూపు కూడా ఉన్నాయి.ఈ నాలుగు గ్రూపుల్లో ఏదైనా ఒకటి భారత పవర్ గ్రిడ్లలో ఉందో లేదో తెలియాలంటే పూర్తి సమాచారం రావాల్సి ఉందని తెలిపారు. ఫిబ్రవరి నుంచే ఈ తరహా హ్యాకింగ్ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ముంబై మిర్రర్ నివేదిక తెలిపింది.

జాన్సన్ అండ్ జాన్సన్‌ రూ.890కోట్లు చెల్లించాలని కోర్ట్ ఆర్డర్


ముంబై పవర్ కట్ ఘటన సమయంలో మహారాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి నితిన్ రౌత్.. సాంకేతిక సమస్య కారణంగానే తలెత్తిందని అన్నారు. ఈ ఏడాదిలో గత ఆరునెలల కాలంలో భారీ పవర్ కట్ కావడం ఇదే తొలిసారి కాదు.. జమ్మూ కశ్మీర్‌లో జూన్ నెలలో పవర్ డిపార్ట్ మెంట్ డేటా సెంటర్లలోనూ సైబర్ దాడి జరిగింది.మూడు రోజుల వ్యవధిలో వెబ్ సైట్, మొబైల్ యాప్ సర్వీసులన్నీ ఒకేసారి డౌన్ అయ్యాయి. ర్యాన్ సామ్ వేర్ ఎటాక్ జరిగిందని, అన్ని అధికారిక ఫైళ్లు, డేటాను హ్యాకర్లు ఎన్ క్రిప్టడ్ చేశామన్నారు. సైబర్ దాడికి ముందే డేటా సెంటర్లను షట్ డౌన్ చేయడంతో కేవలం నాలుగు సర్వర్లపై మాత్రమే దాడి జరిగిందన్నారు.

Related Tags :

Related Posts :