muslim man Naseem jailed for begging as lord hanuman getap in UP bareilly

హనుమాన్ వేషంతో భిక్షాటన చేస్తున్న ముస్లిం యువకుడు అరెస్ట్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఓ ముస్లిం యువకుడు ఓ దేవాలయం దగ్గర హనుమంతుడి వేషం వేసుకుని భిక్షాటన చేస్తున్నాడు. అలా భజరంగ్ కార్యకర్తల కళ్లబడ్డాడు. వారికి అతనిపై అనుమానం వచ్చింది. నువ్వు ఎవరివీ? నీ పేరు ఏంటి అని ప్రశ్నించాడు. దానికి ఆ యువకుడు నా పేరు ‘నసీమ్’ అని చెప్పాడు. అంతే.. భజరంగ్ కార్యకర్తలు వెంటనే అతణ్ని పట్టుకుని పోలీసు స్టేషన్ లో తీసుకెళ్లారు.

‘ఓ ముస్లిం యువకుడు హనుమంతుడి వేషధారణలో భిక్షాటన చేయటం హిందువుల మనోభావాలు’ దెబ్బతినేలా చేశాడని ఫిర్యాదు చేశారు. ఈ ఘటన యూపీలోని సుభాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుపమ్ నగర్ కాలనీలోని ఓ దేవాలయం దగ్గర జరిగింది. 

ఈ కేసు విషయంపై స్థానిక పోలీస్ అధికారి మాట్లాడుతూ..మొరాదాబాద్ నివాసి అయిన నాసిమ్ ను పీఎస్ కు కొంతమంది తీసుకు వచ్చారనీ..అతను హనుమంతుని వేషంతో భిక్షాటన చేస్తున్నాడని ఇది హిందూ మనోభావాలను దెబ్బతీసే విషయమని చెప్పి కంప్లైంట్ వచ్చిందని తాము కేసు నమోదు చేసుకుని నసీమ్ ను అదుపులోకి తీసుకున్నామని కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 

కాగా నసీమ్ భిక్షాటన కోసం తరచూ తన వేషధారణలు మార్చుకుని యాచన చేస్తుంటాడని పోలీసులు తెలిపారు. గతంలో మజ్నూ వేషంతో పాటు పలు వేషాలు వేసేవాడనీ కానీ హనుమంతుడి వేషం వేయటం మొదటిసారి చూస్తున్నామని చెప్పారు. భిక్షాటన చేయవద్దని అతనికి ఎన్నిసార్లు చెప్పినా మానటం లేదనీ..సదరు వ్యక్తుల ఫిర్యాదుతో నసీమ్ ను అరెస్ట్ చేసి జైలు పంపించామని తెలిపారు. 

Related Posts