రామమందిర నిర్మాణానికి తరలి వస్తున్న రామ భక్తులైన ముస్లింలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

దశాబ్దాల తరబడి అయోధ్య రామమందిర స్ధల వివాదంలో హిందూ ముస్లింల మధ్య కోర్టుల్లో కేసులు నడిచివప్పటికీ ఆగస్టు 5న జరిగే రామ మందిరం శంకు స్ధాపనకు దేశం నలుమూలలనుంచి ముస్లింలైన రామ భక్తులు అయోధ్యకు తరలి వస్తున్నారు.

రామమందిర నిర్మాణం హిందూ,ముస్లిం ల మధ్య ఉన్న విరోధాన్ని చెరిపేసి రామ భక్తులు అందిరినీ ఒక తాటిపైకి తీసుకు వస్తోంది. చత్తీస్ ఘడ్ లోఉండే ఫైజ్ ఖాన్ తన రాష్ట్రం నుండి రామ మందిర నిర్మాణానికి ఇటుకలు తీసుకు వచ్చాడు. ఆగస్టు 5న ప్రధాన మంత్రి మోడీ శంకుస్ధాపన చేసే దృశ్యాన్ని తిలకించేందుకు వేలాది రామ భక్తులైన ముస్లింలు అయోధ్యకు తరలివచ్చేందుకు సిధ్దంగా ఉన్నారు.

రాముడ్ని ఇమామ్-ఎ-హింద్ అని భావించే కొందరు ముస్లింలు మాట్లాడుతూ… తామంతా ఇస్లాం స్వీకరించటానికి ముందు రాజ్ పుత్ ల మని చెప్పుకొచ్చారు. ఇస్లాం లోకి మారి ఇస్లాం ఆధారంగా ప్రార్ధనలు చేస్తున్నాము కానీ.. మా పూర్వీకులంతా రాముడి భక్తులే… వారి మతాన్ని ఏవరూ మార్చలేరుగా అని అన్నారు. మక్కాకు వెళ్లి ప్రార్ధనలు చేసి వచ్చిన సయీద్ అహ్మద్ అనే ముస్లిం రామ భక్తుడు మేము రాముడ్నిఇమామ్-ఎ-హింద్ గా భావించి పూజిస్తాము. రామ మందిరనిర్మాణం పూర్తయ్యేంత వరకు అయోధ్యలోనే ఉండి సేవ చేయటానికి సిధ్దంగా ఉన్నానని చెప్పాడు.

ముస్లింరాష్ట్రీయ మంచ్ కు చెందిన నాయకులు మాట్లాడుతూ దేశంలోని చాలా మంది ముస్లిం రామ భక్తులు కరసేవ చేయటానికి అయోధ్య వస్తున్నారని చెప్పారు. మాకు ఇది శ్రీరామ చంద్రుడు కల్పించిన అవకాశం గా భావిస్తున్నామని, శంకుస్ధాపన రోజు గర్భగుడిలోకి వెళ్లేందుకు అవకాశం వస్తే తప్పకుండా వెళ్లి దర్శనం చేసుకుంటామని..ఒక వేళ భధ్రతా కారణాల వల్ల కుదరకపోతే తర్వాతి రోజు దర్శనం చేసుకుంటామని ముస్లిం భక్తులు చెప్పారు.

Related Posts