లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

చేతిలో జాతీయ జెండాలతో : ట్యాంక్ బండ్ పై ముస్లింల మిలియన్ మార్చ్

హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ముస్లింలు మిలియన్ మార్చ్ నిర్వహించారు. ఈ మార్చ్ కు ముస్లింలు భారీగా తరలివచ్చారు. ఎన్ పీఆర్, ఎన్ఆర్ సీ, సీఏఏకు వ్యతిరేకంగా ముస్లింలు ఈ

Published

on

muslisms million march on tankbund

హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ముస్లింలు మిలియన్ మార్చ్ నిర్వహించారు. ఈ మార్చ్ కు ముస్లింలు భారీగా తరలివచ్చారు. ఎన్ పీఆర్, ఎన్ఆర్ సీ, సీఏఏకు వ్యతిరేకంగా ముస్లింలు ఈ

హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ముస్లింలు మిలియన్ మార్చ్ నిర్వహించారు. ఈ మార్చ్ కు ముస్లింలు భారీగా తరలివచ్చారు. చేతిలో జాతీయ జెండాలతో మార్చ్ లో పాల్గొన్నారు. ఎన్ పీఆర్, ఎన్ఆర్ సీ, సీఏఏకు వ్యతిరేకంగా ముస్లిం సంఘాలు ఈ మార్చ్ నిర్వహించాయి. మిలియన్ మార్చ్ కి పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. 

మిలియన్ మార్చ్ తో ట్యాంక్ బండ్ తో పాటు పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ట్యాంక్ బండ్ పై వాహనాలు బారులు తీరాయి. ముందుకి పోలేక వెనక్కి రాలేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లక్డీకాపూల్, రవీంద్రభారతి, అబిడ్స్, ఎల్బీ స్టేడియం మీదుగా ర్యాలీ సాగుతోంది. లిబర్టీ చౌరస్తా, ఆర్టీసీ ఎక్స్ రోడ్డుల నుంచి ఇందిరా పార్క్ వరకు ఈ ర్యాలీ చేపట్టారు.

ఈ భారీ ప్రదర్శనలో ముస్లింలతో పాటు దళిత సంఘాలు సహా విద్యార్ధి సంఘాలు, సామాజిక సంస్థలు పాల్గొన్నాయి. వివిధ జిల్లాల నుంచి ప్రజలు తరలివచ్చారు.

సీఏఏ, ఎన్పీఆర్‌, ఎనార్సీలను ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దేశ విభజనకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. రాజ్యాంగాన్ని నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు. ‘రాజ్యాంగాన్ని కాపాడండి’ అనే నినాదం వినిపిస్తున్నారు. ఎన్పీఆర్‌, ఎనార్సీకి తేడా లేదన్నారు. దేశ విభజన సమయంలో ఇక్కడే ఉండాలని ముస్లింలు నిర్ణయించుకున్నపుడే వారి దేశభక్తి నిరూపితమైందని, ఇప్పుడు కొత్తగా నిరూపించుకోవడానికి ఏముందని ప్రశ్నిస్తున్నారు.
Also Read : తెలంగాణలో ఫస్ట్ టైమ్ : కరీంనగర్ లో కొత్త ట్రాఫిక్ పోలీసులు.. 24 అవర్స్ డ్యూటీ