10 గంటలు గ్లౌజ్ ధరిస్తే..ఇదిగో నా చేయి ఇలా అయిపోతుంది

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా వైరస్ సోకిన రోగులకు సేవలందిస్తున్న వైద్యులు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా నిలుస్తున్నారు. కోవిడ్ వార్డులో చికిత్సలో భాగంగా..తాను పది గంటల పాటు గ్లౌజ్ వేసుకున్న అనంతరం తన చేయి ఇలా అయిపోతుందని యూపీకి చెందిన ఓ వైద్యుడు షేర్ చేసిన ఫొటో తెగ వైరల్ అవుతోంది.

ఫొటోలో ఆ డాక్టర్ చేయి..పూర్తిగా ముడతలు పట్టినట్లుగా ఉంది. సార్..నిజంగా హాట్సాఫ్, వెల కట్టలేనిది సార్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. యూపీలో సయ్యద్ ఫైజాన్ అహ్మద్ వైద్యుడిగా సేవలందిస్తున్నారు. కోవిడ్ వార్డులో డాక్టర్ల పరిస్థితిపై ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.

ప్రతి ఐదు గంటలకు ఒకసారి గ్లౌజులు మార్చాలి. ఇందుకు 5-7 నిమిషాల సమయం పడుతుది. కానీ చాలా సార్లు అది వీలుకాదు.. సమయం కూడా దొరకదు. ఎందుకంటే విధుల్లో ఒక్కరే ఉంటారు. పేషెంట్‌ దగ్గర ఇతర సిబ్బంది అందుబాటులో ఉండరు.

అంతేకాదు కొన్ని సందర్భాల్లో వార్డ్‌బాయ్‌, నర్స్‌ పాత్రలు వైద్యుడు పోషించాల్సి ఉంటుంది. షిఫ్ట్‌ అయిపోయింది.. ఇక నేను వెళ్తాను అనే పరిస్థితి కూడా ఉండదు అన్నారు.

కరోనా మహమ్మారి భారతదేశంలో ఉగ్రరూపం దాలుస్తోంది. ఎంతో మంది వైద్యులు రాత్రింబవళ్లు పని చేస్తున్నారు. కానీ..జనాభాకు తగ్గట్టు వైద్యులు లేకపోవడంతో వారిపై తీవ్ర వత్తిడి పడుతోంది. అయినా..వారు వెనుకడుగు వేయడం లేదు.

వారిని రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కోవిడ్ వార్డులో చికిత్స పొందుతున్న వారిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. అందుకే ఈ పోరాటంలో ‘ఫ్రంట్ లైన్ వారియర్స్’ గా పిలుస్తున్నారు.

Related Posts