Home » ఓటు హక్కును వినియోగించుకున్న మైహోం గ్రూపు అధినేత
Published
2 months agoon
By
sreehariMyHome Group Chiarman:జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్. జూపల్లి రామేశ్వరరావు, ఆయన భార్య శ్రీకుమారి సతీసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటు వేసిన అనంతరం సిరా మార్క్ ను మీడియాకు, ప్రజలకు చూపించిన ఆయన.. ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మై హోం గ్రూప్ డైరెక్టర్లు రంజిత్ రావు, రాజిత.. జూబ్లి పబ్లిక్ స్కూల్ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది.