Home » పానీపూరి తినడానికి వెళ్లి శవాలుగా మారిన తల్లీకూతుళ్లు.. చెరువులో మూడు మృతదేహాలు.. అసలేం జరిగింది?
Published
3 months agoon
By
naveenmother children death in vizianagaram: ఆమెది ఓ అందమైన జీవితం. భర్త, ఇద్దరు కూతుళ్లతో దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. సీన్ కట్ చేస్తే.. ఓ రోజు ఆమెతో పాటు ఆమె ఇద్దరు కూతుళ్లు చెరువులో శవాలుగా ప్రత్యక్షమయ్యారు. సాయంత్రం వేళ బయటకు వెళ్లిన ఆ ముగ్గురు.. తెల్లారేసరికి విగతజీవులుగా మారారు. మరి ఆ తల్లీకూతుళ్లకు ఏమైంది..? ఆత్మహత్య చేసుకున్నారా..? హత్య చేశారా..?
హత్యా? ఆత్మహత్యా? అసలేం జరిగింది?
ఓ చిన్నారి వయసు ఆరేళ్లు.. మరో చిన్నారికి ఏడేళ్లు.. ఆ ఇద్దరిది తల్లి ఒడిలో ఆడుకోవాల్సిన వయసు.. కానీ..ఆ చిన్నారులిద్దరు ఓ చెరువులో శవలుగా తేలారు.. ఆ ఇద్దరే కాదు..ఆ చిన్నారుల తల్లి కూడా శవమైంది..
సాయంత్రం పానీపూరి తిందామంటూ బయటకెళ్లారు.. తెల్లారేసరికి చెరువులో శవాలుగా ప్రత్యక్షమయ్యారు.. మరి పిల్లలతో సహా సూసైడ్ చేసుకుందా..? ఎవరైనా చంపేశారా..? ఒకవేళ ఆత్మహత్యే అయితే…పిల్లలకు చిన్న గాయమైతేనే తల్లి గుండె తట్టుకోలేదు..మరి కడుపున పుట్టిన పిల్లల్ని..ఆ తల్లి తన చేతులతోనే ఎందుకు ఉసురు తీయాల్సి వచ్చింది.? హత్య అయితే తల్లీకూతుళ్లను చంపాల్సిన అవసరం ఎవరికుంది..? ఇంతకీ తల్లీకూతుళ్లకి ఏమైంది..? విజయనగరం జిల్లా కొత్తవలస మండలం నరపాంలో ఈ విషాద ఘటన జరిగింది.
తొమ్మిదేళ్ల క్రితం మేనకోడలిని పెళ్లి చేసుకున్న శ్రీనివాసరాజు:
శ్రీనివాసరాజు తొమ్మిదేళ్ల క్రితం తన సొంత మేనకోడలైన గౌరీని వివాహం చేసుకున్నాడు. సొంతూరు విజయనగరం జిల్లా గజపతినగరం కాగా, అక్కడ నుంచి కొత్తవలస మండలం తుమ్మికాపల్లి వలస వచ్చి నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ఏడేళ్లు, ఆరేళ్ల వయసున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. శ్రీనివాసరాజు లారీ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
సాయంత్రం బయటకు వెళ్లారు, తెల్లావారుజామున చెరువులో శవాలుగా మారారు:
సీన్‌కట్ చేస్తే… అక్టోబర్ 15 సాయంత్రం…గౌరి తన ఇద్దరి పిల్లలు సంకీర్తన, హాసినిలను వెంటబెట్టుకుని బయటకు వెళ్లింది. ఆ తర్వాత తిరిగి ఇంటికి రాలేదు. భయాందోళనకు గురైన కుటుంబసభ్యులు రాత్రంతా గాలించారు. అయినా ఆచూకీ లభించ లేదు. ఉదయం మళ్లీ గాలిస్తూ…అనుమానంతో సమీపంలో ఉన్న చెరువు వద్దకు వెళ్లి చూశారు. అక్కడ పిల్లలు పాదాల గుర్తులు కనిపించాయి. వెంటనే చెరువులో గాలించగా, ముగ్గురి మృతదేహాలు బయటపడ్డాయి.
కుప్పకూలిన కుటుంబసభ్యులు:
కొన్ని గంటల ముందు వరకు ఆడుతూ, పాడుతూ కళ్లేదుటే కన్పించిన చిన్నారులు విగత జీవులుగా మారడం చూసి..కుటుంబసభ్యులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అభం, శుభం తెలియని పిల్లలకు ఎంత కష్టం వచ్చిందంటూ కన్నీరుమున్నీరయ్యారు. పిల్లలతో సహా ఆ తల్లి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందంటూ శోకసంద్రంలో మునిగిపోయారు.
కుటుంబకలహాలేమైనా ఉన్నాయా? ఆర్థిక ఇబ్బందులా..? బయటి వ్యక్తుల ప్రమేయం ఉందా?
మరి ఏ పాపం తెలియని చిన్నారులతో సహా.. ఆ మహిళ ఎందుకు ప్రాణాలు తీసుకుంది.? కుటుంబకలహాలేమైనా ప్రాణం తీశాయా..? అంటే..భర్త శ్రీనివాసరాజుతో ఎటువంటి గొడవలు లేవని, వాళ్ల దాంపత్యం సజావుగానే సాగుతోందని కుటుంబసభ్యులు, బంధువులు చెబుతున్న మాట. మరి ఏం జరిగింది..? ఆ దంపతుల మధ్య బయటకు కనిపించని గొడవలు ఏమైనా ఉన్నాయా..? ఆర్థిక ఇబ్బందులా..? మరణం వెనుక బయట వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉందా..? ఈ ప్రశ్నలకు సమాధాలు కుటుంబసభ్యులు, స్థానికులతో పాటు పోలీసులకు సైతం అంతు చిక్కడం లేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆత్మహత్యా.. హత్యా..అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. కారణం ఏదైనా…చిన్నారులు బలైన ఘటన..స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.