లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

దీక్షిత్ ఎక్కడ ? కిడ్నాప్ చేసింది బాబాయేనా ?

Published

on

Mystery Continues on Deekshith Kidnap Case : మహబూబాబాద్ జిల్లాలో బాలుడు దీక్షిత్ కేసు మిస్టరీ వీడడం లేదు. కిడ్నాప్ అయి 37 గంటలుగా కిడ్నాపర్ చెరలోనే 9 ఏళ్ల దీక్షిత్ ఉండడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తన కొడుక్కి ఎలాంటి హానీ తలపెట్టవద్దని కోరుతున్నారు.2020, అక్టోబర్ 19వ తేదీ సోమవారం మధ్యాహ్నం నుంచి కిడ్నాప్ చేసిన వ్యక్తి నుంచి ఎలాంటి ఫోన్ కాల్ రాకపోవడంతో వారు తల్లడిల్లుతున్నారు. దీక్షిత్ బాబాయ్ మనోజ్ ను అదుపులోకి తీసుకున్న తర్వాత..ఫోన్ కాల్స్ బంద్ అయ్యాయి. దీంతో మనోజ్ పైనే పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మహబూబాబాద్ జిల్లాలో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్‌ కలకలం, రూ.45లక్షలు ఇవ్వాలని డిమాండ్


మనోజ్..బాబు తండ్రి రంజిత్ రెడ్డి బాబాయ్ కొడుకు. చీటీల డబ్బు వసూలు కోసం మనోజ్ ను రంజిత్ రెడ్డి పనిలో పెట్టుకున్నాడు. కిడ్నాపైన రోజు మనోజ్ బైక్ పై వెళ్లాడని దీక్షిత్ స్నేహితులు చెబుతున్నారు. బాలుడి ఆచూకీ కోసం 8 ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.ఇద్దరు డీఎస్పీలు, 8 మంది సీఐలు, 15 మంది ఎస్ ఐ ల నేతృత్వంలో సెర్చింగ్ చేస్తున్నారు. నెట్ కాల్స్ కారణంగా..లోకేషన్ తెలియకుండా కిడ్నాపర్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు.

2020, అక్టోబర్ 19వ తేదీ సోమవారం దీక్షిత్ తల్లికి ఫోన్ చేసిన కిడ్నాపర్లు రూ. 45 లక్షలు కావాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. దీక్షిత్ కిడ్నాప్ సుఖాంతం కావాలని కోరుకుంటున్నారు.

పాత రూపాయి కాయిన్‌ ఇస్తే పాతిక లక్షలు వస్తాయట!!

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *