లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

ఆహా లో ‘నారింజ మిఠాయి’

Published

on

Naarinja Mithai: తెలుగు కంటెంట్‌తో పాటు ఇతర భాషల్లో ఆదరణ పొందిన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ రోజురోజుకీ డిజిటల్ రంగంలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘ఆహా’ మరో వైవిధ్య భరితమైన చిత్రాన్ని ఆడియన్స్‌ ముందుకు తీసుకొస్తుంది. సముద్రఖని, సునయన, మణికందన్, నివేదితా సతీష్ ప్రధాన పాత్రల్లో హలిత షమీమ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ్‌ చిత్రం ‘సిల్లు కరుప్పత్తి’..

2019 లో విడుదలైన ఈ చిత్రం కోలీవుడ్‌లో బాక్సాఫీస్ వద్ద విజయవంతమవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అలాగే బెంగుళూరు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, టొరంటో తమిళ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ ఈ చిత్రాన్ని ప్రదర్శించారు.

‘ఆహా’ ఈ సినిమాను తెలుగులో ‘నారింజ మిఠాయి’ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. బుధవారం ‘నారింజ మిఠాయి’ టీజర్ రిలీజ్ చేశారు.
ఎటువంటి డైలాగ్స్ లేకుండా కేవలం బ్యాగ్రౌండ్ స్కోర్‌తో రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది. జనవరి 29వ తేదీ నుంచి ‘ఆహా’ లో ‘నారింజ మిఠాయి’ స్ట్రీమింగ్ కానుంది.