లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

పడి లేచిన వాడితో పందెం.. చాలా ప్రమాదకరం..

Updated On - 1:43 pm, Fri, 22 January 21

Lakshya: యూత్‌లో లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్న యంగ్ హీరో నాగ శౌర్య సరికొత్త పాత్రలో కనిపించబోతున్న చిత్రం ‘లక్ష్య’.. ఆర్చరీ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సోనాలీ నారంగ్ సమర్పణలో.. నారయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావ్, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

జనవరి 22 న నాగశౌర్య పుట్టినరోజు సందర్భంగా‘లక్ష్య’ టీజర్ రిలీజ్ చేశారు. ‘చాలా మందికి ఆటతో గుర్తింపు వస్తుంది.. కానీ ఎవడో ఒకడు పుడతాడు.. ఆటకే గుర్తింపు తెచ్చేవాడు’ అంటూ జగపతి బాబు చెప్పే డైలాగ్‌తో స్టార్ట్ అయిన టీజర్ ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉంది. నాగ శౌర్యను డిఫరెంట్ గెటప్స్‌లో చూపించారు.

హీరోకి, ఆటకీ, తాతకీ మధ్య అనుబంధం టీజర్‌లో చూపించారు. కాల భైరవ బ్యాగ్రౌండ్ స్కోర్, రామ్ విజువల్స్ బాగున్నాయి. కేతిక శర్మ కథానాయిక. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ‘లక్ష్య’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.