లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

‘అమరం అఖిలం ప్రేమ’.. నాగబాబు, నిహారిక ఏమన్నారంటే..

Published

on

Nagababu and Niharika about Amaram Akhilam Prema: విజయ్ రామ్, శివశక్తి సచ్‌దేవ్ జంటగా నటించిన చిత్రం ‘అమరం అఖిలం ప్రేమ’. చలన చిత్రాలు బ్యానర్‌పై వి.ఇ.వి.కె.డి.ఎస్.ప్రసాద్, విజయ్ రామ్ఈ చిత్రాన్ని నిర్మించారు. జోనాధన్ ఎడ్వర్డ్ దర్శకుడు. సెప్టెంబర్ 18న ఈ సినిమాను తెలుగు ఓటీటీ యాప్ ఆహాలో విడుదల చేస్తున్నారు.


ఇటీవల కింగ్ నాగార్జున చేతులమీదుగా విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మెగా డాటర్ నిహారిక కొణిదెల, నాగబాబు ‘అమరం అఖిలం ప్రేమ’ ట్రైలర్‌పై చిత్ర యూనిట్‌తో కలిసి వీడియో కాల్ ద్వారా తమ స్పందనను పంచుకున్నారు.


తండ్రీ కూతుళ్ల అనుబంధం ఎంత మధురమైందో తెలియచేస్తూ రూపొందించిన ఈ చిత్రం ట్రైలర్ ఆకట్టుకుందని నాగబాబు అన్నారు.
నాన్న చిన్నప్పటినుంచి ఎటువంటి ఇబ్బందిలేకుండా పెంచారని డాడీ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలుపుతూ చిత్రబృందానికి శుభాకాంక్షలు చెప్పారు నిహారిక.. విజయ్ రామ్, శివశక్తి సచ్‌దేవ్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కూడా మాట్లాడారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *