కరోనా బారినపడ్డ మెగాబ్రదర్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Nagababu Tests Covid Positive: కరోనా వైరస్‌ మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టలేదు. టాలీవుడ్‌లో ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు కోవిడ్‌ ప్రభావానికి గురయ్యారు. రాజమౌళి, ఎం.ఎం.కీరవాణి, ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం తదితరులు కోవిడ్‌ ప్రభావానికి గురైనవారే. ఇప్పుడు మెగాబ్రదర్‌ నాగబాబు కరోనా వైరస్‌ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్‌ ద్వారా తెలియచేశారు.


నీ పుట్టినరోజు నాడు ఎన్నో లక్షల కుటుంబాలకు సంతోషం విస్తరించింది తమ్ముడు..నాగబాబు స్పెషల్ విషెస్


‘‘ఇన్‌ఫెక్షన్‌ ఎల్లప్పుడూ మనల్ని బాధకు గురిచేయదు. దాన్ని ఇతరులకు సాయం చేసే అవకాశంగా మలుచుకోవాలి’’ అని ట్వీట్ చేశారు. తాను త్వరలోనే కోలుకుని ప్లాస్మా డోనర్‌గా మారుతానని ఆయన తెలిపారు. ఈ మధ్య నాగబాబు ఓ టీవీ షోలో పాల్గొంటున్నారు. బహుశా అక్కడి నుండే ఆయనకు కరోనా సోకి ఉండొచ్చని భావిస్తున్నారు. నాగబాబు త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, మెగాభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Related Posts