NagaBabu Slams Balakrishna over Sankara Jathi Comment

సంకరజాతి అంటావా.. ఎంత అహంకారం : బాలయ్యకి నాగబాబు కౌంటర్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కొణిదెల నాగబాబు కౌంటర్లు కొనసాగుతున్నాయి. నందమూరి బాలయ్యను టార్గెట్ చేస్తూ.. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ జబర్థస్త్ పంచ్ లు వేస్తున్నారు. ఐదో సమాధానంగా బాలయ్య సంకర జాతి కామెంట్స్ ఎత్తిచూపుతూ.. తనదైన శైలిలో రెచ్చిపోయారు ఆయన.
అప్పట్లో బాలయ్య ఏమన్నారంటే : ఈ మధ్యన సంకర జాతి పార్టీలు పుట్టుకొస్తున్నాయి. అలగా బలగా జనాన్ని వెంటేసుకుని మరీ తిరుగుతన్నాయి. తండ్రి మతాచార్యుడు.. తనయుడు ఆచార్యుడు. తల్లి రామానుజ మతస్తురాలు.. అల్లుడు పింజారీ.. మరదలు మార్వాడీ. సంకర పార్టీ. ఒక తోక లేదు. ఓ తొండం లేదు. అలగా బలగా జనాన్ని వెంటేసుకుని తిరుగుతున్న పార్టీలన్నీ ఇప్పుడు చూస్తున్నాం అంటూ వ్యాఖ్యలు చేశారు బాలయ్య. అనంతపురం జిల్లాలో జరిగిన టీడీపీ కార్యక్రమంలో.. కొన్నాళ్ల క్రితం ఈ మాటలు అన్నారు హిందూపురం ఎమ్మెల్యే.
నాగబాబు కౌంటర్ ఇలా ఉంది :
ఈ మాటలు వింటుంటే ఇతర కులాలు, మతాలపై మీకు ఉన్న గౌరవం ఏంటో అర్థం అవుతుంది. ఇంత వెటకారం, అంత అహంకారం పనికిరాదు. మీరు చేసిన ఈ వ్యాఖ్యలు జనసేన పార్టీని ఉద్దేశించి చేసినవే అనుకుంటున్నాను. మీరెంత అహంకారంతో మాట్లాడుతున్నారో మీకు ఎవరూ చెప్పటం లేదా అని ప్రశ్నించారాయన. పార్టీని విమర్శించటం కామన్.. వ్యక్తులను సంకర జాతితో పోల్చటం ఏం గౌరవం, ఏం భాష అని నిలదీశారు నాగబాబు. పార్టీ సిద్ధాంతాలు వేరు.. పార్టీలోని వ్యక్తులు వేరు అన్న సంగతి గుర్తుకు రావటం లేదా అని ప్రశ్నించారు. జనసేన పార్టీలో అన్ని కులాలు, మతాలకు ప్రాతినిధ్యం ఉంది.. అందరూ కలిసి పని చేస్తున్నారు.. వాళ్లను మీరు కించపరిచినట్లు కాదా అని బాలయ్యను సూటిగా ప్రశ్నించారు. మీరెంత అహంకారంతో మాట్లాడుతున్నారో అర్థం అవుతుంది. ప్రజలు అన్నీ చూస్తున్నారు.. అన్నీ గమనిస్తున్నారు. గొడవలు ఎందుకు అని ఇన్నాళ్లు చూస్తూ ఊరుకున్నాను.. ఇక నుంచి అలా కుదరదు అని ఘాటుగా స్పందించారు నాగబాబు. 
వివాదానికి ముగింపు పలుకుతా :
ఇప్పటికే 5 వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చిన నాగబాబు.. మరొకటి మిగిలే ఉందని చెప్పుకొచ్చారు. ఆరో కామెంట్ కు కౌంటర్ ఇచ్చి.. వివాదానికి ముగింపు పలుకుతాను అని స్పష్టం చేశారు. ఎవరితోనూ గొడవలు పెట్టుకునే ఉద్దేశం లేదని తేల్చేశారు. 

Related Posts