Home » ప్రకాష్ రాజ్‌కి నాగబాబు వార్నింగ్.. పవన్ కళ్యాణ్‌పై విమర్శలకు కౌంటర్!
Published
2 months agoon
By
vamsiపవన్ కళ్యాణ్ పూటకో పార్టీ మార్చే ఊసరవెల్లి.. బీజేపీకి మద్దతు ఇవ్వాలంటే.. ఇక, జనసేన ఎందుకు? ఇంకొకరి భుజాన ఎక్కి ఈ రాజకీయాలు ఎందుకు? ప్రజలారా.. ఈసారి మీరే ఇలా వచ్చిన వారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి పంపాలి. వీళ్లకే కాక, వీళ్ల వెంట వెళ్లిన మనవాళ్లకు కూడా బుద్ధి చెప్పాలంటూ ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మెగా బ్రదర్, జనసేన నాయకుడు నాగబాబు తనదైన శైలిలో విమర్శలు చేశారు.
ప్రకాష్ రాజ్ పనికిమాలిన కుసంస్కారి అంటూ.. డబ్బుకోసం నిర్మాతల్ని హింసించినట్లుగా సోషల్ మీడియా ద్వారా విమర్శించారు. ‘రాజకీయాల్లో నిర్ణయాలు అనేకసార్లు మారుతూ ఉంటాయి.. అయితే, ఆ నిర్ణయాల వెనుక ఉద్దేశ్యం లాంగ్ టర్మ్‌లో ప్రజలకు ఉపయోగపడేవి అయితే మంచిది అని అన్నారు. మా నాయకుడు పవన్ కళ్యాణ్.. GHMC ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ ఇచ్చి బీజేపీ గెలుపుకి కృషి చేయడం వెనుక ప్రజా ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు ఉన్నాయని మా నమ్మకం. పవన్ కళ్యాణ్ ఎవరికి ద్రోహం చేశాడని, ప్రతి పనికిమాలినవాడు విమర్శిస్తున్నాడు. అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు నాగబాబు.
ఇదే సమయంలో పలు అంశాల గురించి పోస్ట్‌లో ప్రస్తావించారు నాగబాబు. ప్రకాష్ రాజ్ డొల్లతనం ఏంటో బీజేపీ ఎంపీ సుబ్రహ్మస్వామి డిబేట్లోనే అర్థం అయ్యిందని, తొక్కి నారతీస్తుంటే మాట్లాడలేక తడబడటం నాకు ఇంకా గుర్తుందని అన్నారు. నీ దృష్టిలో బీజేపీ తీసుకునే నిర్ణయాలు నచ్చకపోతే విమర్శించు తప్పులేదు. మంచి చేస్తే మెచ్చుకోలేని నీ కుసంస్కారం గురించి ఏం చెప్పగలం. ఈ దేశానికి బీజేపీ, ఏపీకి జనసేన పార్టీతోనే అభివృద్ధి సాధ్యం. నీలాంటి కుహనా మేధావులు ఎన్ని వాగినా బీజేపీ, జనసేన విజయాన్ని ఆపలేరు. బీజేపీ నేతల్ని నువ్వు ఎన్ని మాటల అన్నా వాళ్లు నిన్ను ఏమీ అనడంలేదంటే ఆ పార్టీ ప్రజాస్వామ్యానికి ఇచ్చే విలువ ఏంటో అర్థం చేసుకో అంటూ హితవు పలికారు.
‘నిర్మాతలని డబ్బు కోసం ఎన్ని రకాలుగా హింస పెట్టావో, డేట్స్ ఇచ్చి రద్దు చేసి ఎంత బాధపెట్టావో అన్నీ గుర్తున్నాయి. మరోసారి పవన్ గురించి మాట్లాడే ముందు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు నాగబాబు. డైరెక్టర్స్‌ని కాకా పట్టి నిర్మాతల్ని కాల్చుకుతిన్న నీకు ఇంతకన్నా మంచిగా మాట్లాడడం రాదులే. బీజేపీ నాయకత్వాన్ని నువ్వు నోటికొచ్చినట్టు విమర్శించినా నిన్ను ఎవరూ ఏమీ అనలేదంటే అది బీజేపీ ప్రజాస్వామ్యానికి ఇచ్చేవిలువ అని అర్థం చేసుకో. బీజేపీ జనసేన GHMC ఎలక్షన్స్‌లో ఖచ్చితంగా తమ సత్తా చాటుకోబోతున్నాయి. మీడియా అడిగింది అని ఒళ్లు పొంగి నీ పనికిమాలిన రాజకీయ డొల్లతనాన్ని బయటవేసుకోకు’ అంటూ ప్రకాష్ రాజ్‌కి గట్టి వార్నింగ్ ఇచ్చారు నాగబాబు.
ప్రకాష్ రాజ్‌కు నా సమాధానం..
Posted by Naga Babu on Friday, 27 November 2020