బిగ్‌బాస్ 4 లో సర్‌ప్రైజ్ ‘గుండుబాస్’గా నాగ్!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

చాలా నెలల తర్వాత కింగ్ నాగ్ ముఖానికి మేకప్ వేసుకున్నారు. ఈ లాక్‌డౌన్ సమయంలో షూటింగ్ చేయడానికి ఎవరూ సాహసించడం లేదు. అయితే నాగార్జున ధైర్యంగా ముందుకొచ్చారు. టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ 4వ సీజన్‌కు కూడా నాగార్జునే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రోమో షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో వేసిన సెట్లో స్టార్ట్ అయింది.‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఫేమ్ కళ్యాణ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ ప్రోమోకి ప్రముఖ కెమెరామెన్ కె.కె. సెంథిల్ కుమార్ ఫొటోగ్రఫీ చేస్తున్నారు.
‘షూటింగ్‌కు హాజరయ్యా, లైట్, యాక్షన్, కెమెరా.. వావ్’.. అని నాగార్జున ట్వీట్ చేశారు. నాగ్ సరికొత్త లుక్‌లో మరింత స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఆయన గెటప్ అదిరిపోయింది అంటున్నారు అక్కినేని అభిమానులు. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ 4లో నాగ్ లుక్ గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

ఈ సీజన్‌లో నాగ్ సరికొత్తగా గుండుతో కనిపించనున్నారట. నాగ్ షేర్ చేసిన రెండు ఫొటోల్లోనూ వెనక్కితిరిగే ఉన్నారు. ఒక ఫొటోలో కేవలం బాడీ మాత్రమే చూపించారు. అలాగే మేకప్ ఆర్టిస్టులు బిగ్‌బాస్ హోస్ట్‌ను గుండుబాస్‌గా తయారు చేస్తున్న వీడియో కూడా బయటకి వచ్చింది. నాగ్ నిజంగానే గుండుతో కనిపించనున్నారనే వార్త నిజమే అనేలా ఉందీ వీడియో. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఫైనల్ అయ్యారని త్వరలో వివరాలు తెలియచేస్తామని నిర్వాహకులు చెప్పారు.

Related Posts