షూటింగ్ సందడి మొదలెట్టిన కింగ్ నాగ్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

చాలా నెలల తర్వాత కింగ్ నాగ్ ముఖానికి మేకప్ వేసుకున్నారు. ఈ లాక్‌డౌన్ సమయంలో షూటింగ్ చేయడానికి ఎవరూ సాహసించడం లేదు. అయితే నాగార్జున ధైర్యంగా ముందుకొచ్చారు. టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ 4వ సీజన్‌ను కూడా నాగార్జునే హోస్ట్‌ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో వేసిన సెట్‌లో స్టార్ట్ అయింది.‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఫేమ్ కళ్యాణ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ ప్రోమోకి ప్రముఖ కెమెరామెన్ కె.కె. సెంథిల్ కుమార్ ఫొటోగ్రఫీ చేస్తున్నారు. ఈ ప్రోమోలో నాగ్ సరికొత్త లుక్‌లో మరింత గ్లామరస్‌గా కనిపించనున్నారని, ఆయన గెటప్ అదిరిపోయిందని తెలుస్తోంది.

చాలా కాలం తర్వాత సెట్‌లో లైట్స్ వెలగడంతో అన్నపూర్ణ స్టూడియోలో వాతావరణం సందడిగా మారిపోయింది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ ఆదేశాలతో పాటు తగిన జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్ జరపుతున్నారు. త్వరలో బిగ్‌బాస్ 4లో పార్టిసిపెట్ చేసే వారి వివరాలు తెలియనున్నాయి.

Related Posts