‘కింగ్’ నాగార్జున స్లిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కొన్ని రోజులుగా కింగ్ నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కనుందనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే మేకర్స్ నుంచి అధికారికంగా ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్‌పై ఎటువంటి వార్తా రాలేదు.

ఏషియన్ గ్రూప్ చైర్మన్ నారాయణదాస్ నారంగ్ జన్మదినం సందర్భంగా, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా కింగ్ నాగార్జున హీరోగా ఓ భారీ చిత్రాన్ని నిర్మించనున్నట్లుగా ప్రకటించారు. ఈ స్లిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు ప్రవీణ్ సత్తారు రచన, దర్శకత్వం వహిస్తారని అధికారికంగా తెలియజేశారు.


ఈ చిత్రాన్ని తమ రెండు బ్యానర్ల మీద నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించనున్నారు. షూటింగ్ త్వరలో ప్రారంభం అవుతుంది. అయితే ఇప్పటి వరకు నాగార్జున, ప్రవీణ్ సత్తారు ప్రాజెక్ట్ గురించి అనేకానేక వార్తలు వినిపించాయి.

ముఖ్యంగా ఈ చిత్రం బాలీవుడ్‌లోని ఓ చిత్రానికి రీమేక్ అనే వార్తలు బాగా వినవచ్చాయి. కానీ ఇప్పుడు నిర్మాతలు ఈ చిత్రానికి రచన, దర్శకత్వం ప్రవీణ్ సత్తారే అని ప్రకటించడంతో.. ఓ ఫ్రెష్ స్క్రిప్ట్‌తోనే ఈ చిత్రం తెరకెక్కనుందనేది అర్థమవుతోంది.


Related Posts