లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

తల్లితో వివాహేతర సంబంధం…..ప్రియుడికి బుధ్ధి చెప్పబోయి….

Updated On - 2:00 pm, Sat, 23 January 21

15 year old boy fails in bid to kidnap mother’s lover, rounded up : తన తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తికి బుధ్ధి చెప్పబోయి, పోలీసులకు దొరికిపోయాడు 15 ఏళ్ల బాలుడు. మహారాష్ట్ర, నాగపూర్ లోని కాన్జీహౌస్ ప్రాంతానికి చెందిన మహిళ, ప్రదీప్ నందన్వర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయంపై భర్తకు, ఆమెకు మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.

ఇంట్లో అమ్మ,నాన్న రోజూ గొడవ పడటం చూసిన వారి 15 ఏళ్ల కుమారుడు ఆలోచనలో పడ్డాడు. తన తల్లి ప్రియుడికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం తన ఇద్దరు స్నేహితులు.సురేష్ కొరాద్కర్(19), మరియొక స్నేహితుడు(17)ని సంప్రదించాడు. వాళ్లుకూడా సహకరిస్తామని చెప్పారు. ముగ్గురు కలిసి నందన్వర్ ను కిడ్నాప్ చేయాలనుకుని ప్లాన్ చేశారు.

జందనాధ్ బుద్వారి లో పని చేస్తున్న నందన్వర్ ను కిడ్నాప్ చేసి బైక్ పై తీసుకువెళుతున్నారు. ఇట్వారీ వద్ద పెట్రోలింగ్ లో ఉన్న పోలీసులను చూసి నందన్వర్ వేగంగా వెళ్తున బైక్ పైనుంచి దూకేశాడు. పోలీసులను చూసిన బాలురు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసుల వద్దకు వెళ్లిన నందన్వర్ కిడ్నాప్ విషయం చెప్పాడు. ఫోన్ చేసి తన ప్రియురాలికి విషయం చెప్పాడు.

నందన్వర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు బాలురను అదుపులోకి తీసుకుని విచారించారు. తన తల్లితో సన్నిహితంగా ఉండటం వల్ల కుటుంబంలో గొడవలుజరుగుతున్నాయని అందుకు నందన్వర్ కు బుధ్ది చెప్పాలనే కిడ్నాప్ చేసినట్లు ఒప్పుకున్నాడు. ముగ్గురు బాలురపై గతంలో ఎటువంటి క్రిమినల్ రికార్డు లేదని, అయినా చట్టపరంగా వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.