Nagpur man arreste for cutting birthday cake with sword

బర్త్ డే కేక్ కట్ చేసినందుకు ఆయుధ చట్టంకింద అరెస్ట్..!!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

బర్త్ డే చేసుకున్న ఓఅబ్బాయి కేక్ కట్ చేశాడు. దీంతో పోలీసులు అతగాడిని అరెస్ట్ చేసి లోపలపడేశారు. అదేంటీ బర్త్ డే కేక్ కట్ చేస్తే అరెస్ట్ చేయటమేంటీ..ఇది పోలీసుల ఓవర్ యాక్షన్ అని అనుకోవచ్చు. కానీ ఈ ఓవరాక్షన్ పోలీసులది కాదు..ఆ బర్త్ డే బోయ్ దే. 

చాలామంది బర్త్ డేలు చేసుకుంటారు. కొంతమంది మరీ అతికిపోతుంటారు. ఏదోక స్పెషల్ చేసి ఆహా..ఏం చేశావురా..ఏదోకటి చేయటంలో నీకు నువ్వే సాటిరా బాబూ అని పొగిడించుకోవాలనుకుంటారు. అదిగో అటువంటిదే ఈ 27ఏళ్ల బర్త్ డే బోయ్ కేక్ కట్టింగ్ కూడా.

వివరాల్లోకి వెళితే..నాగ్ పూర్ కు చెందిన రహతే నగర్ కు చెందిన అమన్ వకిల్ ఉపాడే అనే 27ఏళ్లయువకుడు బర్త్ డే పార్టీ అరేంజ్ చేశాడు. ఆ పార్టీలో కేక్ కట్టింగ్ ను వినూత్నంగా చేయాలనుకున్నాడు. సాధారణంగా కేకును చిన్నపాటి చాకుతో కట్ చేస్తారు. 

కానీ అమన్ మాత్రం వెరీ స్పెషల్ అనిపించుకోవాలనుకున్నాడో ఏమో..చిన్న చాకుకు బదులుగా ఏకంగా బారెడు పొడువున్న కత్తితో అరివీర భయంకరంగా కట్ చేశాడు. ఇంకేముంది ఈ విషయం తెలిసిన పోలీసులు వచ్చి మారణాయుధాల చట్టం కింద పోలీసులు అతణ్ని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. 

ఈ కేక్ కట్టింగ్ ఈ సీన్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. గతంలోనూ అతడు కత్తులతో ఇలాంటి పనికిమాలిన పనులు చేసినట్లు తేలింది. దీంతో పోలీసులు చక్కా వెళ్లి అతణ్ని అరెస్ట్ చేశారు. 

Read: చేతులతో నడుస్తూ కేదార్ నాథ్ కు ప్రదక్షిణలు చేసిన పూజారి

Related Posts