లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

న‌గ్రోటా ఎన్ కౌంటర్…భద్రతా దళాలపై మోడీ ప్రశంసలు

Published

on

PM Modi lauds security forces జ‌మ్మూక‌శ్మీర్‌లోని న‌గ్రోటాలో గురువారం భీక‌ర ఎన్‌కౌంట‌ర్ జ‌రిగిన విష‌యం తెలిసిందే. గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు జైషే ఉగ్ర‌వాదులు న‌లుగురు హ‌తం అయ్యారు. ఈ ఘ‌ట‌న‌పై ఇవాళ(నవంబర్-20,2020)ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ ఉన్న‌త స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు.ఈ భేటీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, విదేశాంగ శాఖ కార్యదర్శి, ఉన్నత స్థాయి నిఘా విభాగం అధికారులు పాల్గొన్నారు. ముంబై దాడులు జ‌రిగి 12 ఏళ్లు అవుతున్న త‌రుణంలో.. ఉగ్ర‌వాదులు మ‌ళ్లీ అటాక్‌కు ప్లాన్ చేసిన‌ట్లు నిఘా వర్గాలు నివేదించాయి. ఈ నేపథ్యంలో కశ్మీర్ సరిహద్దుల్లో, వాస్తవాధీన రేఖ సమీపంలో జరుగుతున్న తాజా పరిణామాలపై ప్రధాని ఈ భేటీ నిర్వహించారు.ఈ సందర్భంగా నగ్రోటా ఘటనలో అధికారుల పనితీరును ప్రశంసిస్తూ సమీక్ష అనంతరం మోడీ ట్వీట్ చేశారు. మ‌న భ‌ద్ర‌తా ద‌ళాలు మ‌రోసారి అత్యంత సాహాసాన్ని, వృత్తి ధర్మాన్ని సమర్థంగా ప్ర‌ద‌ర్శించాయ‌ని ప్ర‌ధాని అన్నారు. అల‌ర్ట్‌గా ఉన్న సైనిక ద‌ళాల‌కు థ్యాంక్స్ చెప్పారు. జ‌మ్మూక‌శ్మీర్‌లో జ‌రుగుతున్న స్థానిక ప్ర‌జాస్వామ్య ప్ర‌క్రియ‌ను అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించిన ఉగ్ర‌వాదుల‌ను సైనిక ద‌ళాలు నిలువ‌రించిన‌ట్లు ప్ర‌ధాని మోడీ తెలిపారు.పాకిస్థాన్‌లోని జైషే మ‌హ‌మ్మ‌ద్ ఉగ్ర‌వాద సంస్థ‌కు చెందిన న‌లుగురు ఉగ్ర‌వాదుల‌ను మ‌న‌వాళ్లు మ‌ట్టుబెట్టార‌ని, ఉగ్ర‌వాదుల నుంచి భారీ స్థాయిలో ఆయుధాలు, పేలుడు ప‌దార్ధాల‌ను స్వాధీనం చేసుకున్నామ‌ని, దీంతో భారీ విధ్వంసాన్ని త‌ప్పించార‌ని మోడీ తెలిపారు.