తెలుగు మాట్లాడిన నైరోబీ.. వీడియో వైరల్

Nairobi From 'Money Heist' Speaks Telugu?

నెట్‌ఫ్లిక్స్‌లో 'మనీహీస్ట్' వెబ్‌సీరిస్ గురించి మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సిరీస్‌ ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్‌. ఈ సిరీస్ లో ఎంతో మోడ్రన్ గా కనిపించే నైరోబీ ఉన్నట్టుండి చీరకట్టులో కనిపించింది. అంతేకాదు తెలుగులో మాట్లాడుతూ.. తన అభిమానులందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సిరీస్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న నైరోబీ ఒక్కసారిగా తెలుగులో మాట్లాడేసరికి నైరోబీ ఇంత చక్కగా తెలుగులో మాట్లాడగలదా అని షాక్ అయ్యారు. 

అయితే నైరోబీ తెలుగులో మాట్లాడుతున్న ఈ సీన్ విసెంటే ఫెర్రర్ అనే పాత టీవీ కార్యక్రమంలోనిది. అనంతపురంలో నివసిస్తున్న సమీరా అనే స్పానిష్ యువతిగా నటించింది. ఇందులో నైరోబీ స్పానిష్ భాషను తెలుగులోకి అనువాదించే పాత్రలో కనిపించింది. 

మొత్తానికి ఆమె నాకు మెడ్రన్ స్టైల్ మాత్రమే కాదు  సాంప్రదాయంగా చీరకట్టుకుని తెలుగులో గలగలా మాట్లాడం కూడా వచ్చని తన అభిమానులను షాక్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె మాట్లాడే తెలుగుని మీరు కూడా ఓసారి వినేయండి.

మరిన్ని తాజా వార్తలు