ప్రేమ,పెళ్లి పేరుతో యువతిపై అత్యాచారం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

pretext of marriage : స్నేహితుడి ద్వారా ఒక యువతిని పరిచయం చేసుకుని ఆమెతో మాట్లాడుతూ…. ప్రేమ పేరుతో లైంగికదాడి చేసిన వ్యక్తి ఉదంతం హైదరాబాద్ లో వెలుగు చూసింది. నల్గోండ జిల్లాకు చెందిన గడ్డం మహేష్ అనేవ్యక్తి(27) డ్రైవర్ గా పని చేస్తుంటాడు.

ఇతనికి యాప్రాల్ లో రవి అనే స్నేహితుడు ఉండేవాడు. రవి తన ఇంటిపక్కన ఉండే యువతిని, ఏడాది క్రితం మహేష్ కు పరిచయం చేశాడు. అప్పటినుంచి వారిద్దరూ ఫోన్ లో తరచూ మాట్లాడుకుంటూ ఉండేవారు. కొద్దినెలలుగా మహేష్ ఆయువతిని ప్రేమించమని వేధించటం మొదలుపెట్టాడు.ఈ ఏడాది జులైలో మహేష్ ఆ యువతి పని చేస్తున్నషాపు వద్దకు వచ్చి జూ పార్క్ కు వెళదాం రమ్మనమని తన బైక్ పై తీసుకువెళ్ళాడు. జూ పార్క్ చూసిన తర్వాత సాయంత్రం 7 గంటలకు అక్కడి నుంచి ఎల్బీ నగర్ లో నిర్మానుష్యంగా ఉండే అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి లైంగిక దాడి చేశాడు. అనంతరం ఆమెను ఇంటివద్ద దింపి వెళ్లిపోయాడు.అలాగే ఈనెల 12వతేదీని పెళ్లి విషయం మాట్లాడదాం రమ్మనమని చెప్పి తీసుకువెళ్లి మరో సారి అత్యాచారం చేసి మరుసటిరోజు ఉదయం 7 గంటలకు న్యూ బోయిగూడలోని ఆమె ఇంటి సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద వదిలి పెట్టి వెళ్లిపోయాడు.ఇంటికి వెళ్లిన యువతి జిరిగిన విషయం మొత్తం తల్లికి చెప్పటంతో వారు గురువారం రాత్రి పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

 

Related Posts