నామా నాగేశ్వరరావుకు మాతృ వియోగం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు. టీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత, నామా నాగేశ్వరరావు మాతృ మూర్తి శ్రీమతి వరలక్ష్మి(91) కన్నుమూశారు.గత 15 రోజులుగా బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా హైదరాబాద్‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆమె ఇవాళ(01 అక్టోబర్ 2020) మధ్యాహ్నం మృతి చెందారు.

వరమ్మ మరణవార్త తెలుసుకున్న పలువురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, జిల్లా ముఖ్య నాయకులు నామా నాగేశ్వర్‌రావును ఫోన్‌లో పరామర్శించారు. వరలక్ష్మి మృతిపట్ల సంతాపం తెలిపారు. సాయంత్రం ఆమె భౌతికకాయాన్ని ఖమ్మంకు తీసుకుని రానున్నారు.

Related Tags :

Related Posts :