కోడి ముందా..? గుడ్డు ముందా..? నమ్రత ఏం చెప్పారో తెలుసా!..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కోడి ముందా..? గుడ్డు ముందా..? ఏళ్ల తరబడి చిక్కు ప్రశ్నగా ఉన్న ఈ గజిబిజి ప్రశ్నకు సూపర్‌స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ జవాబు చెప్పారు.
వివరాళ్లోకి వెళ్తే.. నమ్రత మాజీ మిస్ ఇండియా అనే సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు.

అనంతరం మహేష్‌ను వివాహం చేసుకుని వెండితెరకు దూరమయ్యారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నమ్రత.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

1993 మిస్‌ ఇండియా కార్యక్రమం ఫైనల్‌ రౌండ్‌కు సంబంధించిన వీడియో ఇది. ఫైనల్ రౌండ్‌లో తనకెదురైన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పి నమ్రత కిరీటం గెలుచుకున్నారు. వందల ఏళ్ల నుంచి చిక్కు ప్రశ్నగా ఉన్న ‘కోడి ముందా..? గుడ్డు ముందా..?’ అనే ప్రశ్న ఫైనల్ రౌండ్ కంటెస్టెంట్‌లకు ఎదురైంది.

ఈ ప్రశ్నకు నమ్రత తన స్టైల్లో జవాబుచెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు.. ‘కోడి లేకపోతే గుడ్డు లేదు. కనుక కోడే ముందు’ అనే సమాధానంతో నిర్ణేతలను మెప్పించి మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్నారు నమ్రత.

Related Posts