లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Life Style

‘నాకు అంత శక్తి లేదు.. మహేశ్ రెండ్రోజులు కనిపించకపోతే చాలా మిస్ అయిపోతా’

Published

on

Mahesh Babu – Namrata Shirodkar: టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌.. రొమాంటిక్‌ హీరో మహేష్‌ బాబు అనడంలో నో డౌట్‌.. అలాంటి లవర్‌ బాయ్‌ను లవ్‌లో పడేసింది నమ్రతా శిరోద్కర్‌.. ఈ లవ్‌ బర్డ్స్‌ లీడ్‌ చేస్తున్న 15 ఏళ్ల మ్యారేజ్‌ లైఫ్‌ను ఎలా లీడ్‌ చేశారు? అని నమ్రతాను ప్రశ్నిస్తే.. ఆమె మదిలో మహేష్‌పై గూడుకట్టుకున్న ప్రేమకు మాటల రూపం ఇచ్చారు.

మీరు నమ్ముతారా? 15 ఏళ్ల మా వైవాహిక జీవితం తర్వాత కూడా మేమింకా డీప్‌ లవ్‌లో ఉన్నాం.. ఇప్పటికి మొదటి సారి మేము కలిసిన అనుభూతే ఎల్లప్పుడూ ఉంటుంది… అని చెబుతోంది టాలీవుడ్‌ సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు భార్య నమ్రతా శిరోద్కర్.. మహేష్‌తో మీ మ్యారీడ్‌ లైఫ్‌ ఎలా ఉంది అని అడిగితే ఎన్నో జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది..

వంశీ కలిపింది వారిద్దరిని..
మహేష్‌ బాబుతో పెళ్లి జరిగాక ఎలా ఉంది అని అడిగితే చాలు.. అలా ఓ 20 ఏళ్లు వెనక్కి వెళుతుంది నమ్రతా.. వెంటనే వంశీ సెట్‌ను గుర్తు చేసుకుంటుంది. మొదటిసారి మహేష్‌ను వంశీ మూవీ సెట్‌లో చూశాను. ఆ మూవీ మా కెరీర్‌ ఎదుగుదలకు ఉపయోగపడలేదు. కానీ ఆ సినిమాను ఎప్పటికి మర్చిపోము. అక్కడే మేం కలిశాం. అతడిని చూడగానే అనిపించింది నా మిగతా జీవితం ఇతడితోనే అని. ఆ టైమ్‌లో మహేష్‌ ఫ్యామిలీకి నా గురించి ఏమీ తెలియదు. అదే సమయంలో నా పేరెంట్స్‌కు కూడా మహేష్‌ గురించి ఏమీ తెలియదు..

సినిమా ఫ్లాప్‌.. కానీ వారి లవ్‌ స్టోరి మాత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్..
సెట్‌లో కలిశారు.. మాట్లాడుకున్నారు.. కానీ వారు పెళ్లి చేసుకోవడానికి నాలుగేళ్ల సమయం పట్టింది. 2005 ఫిబ్రవరి 10న మహేష్‌-నమ్రత వివాహం జరిగింది. మధ్యలో నాలుగేళ్ల గురించి అడిగితే నమ్రత మళ్లీ జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు. నేనే తనకు సరైన భార్యనని ఫ్యామిలీలో ఒప్పించడం చాలా అవసరమనుకున్నాడు మహేష్‌. అందుకోసం నాలుగేళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ నాలుగేళ్ల కాలంలో మేం కలిసింది చాలా తక్కువ. నేను మహేష్ కోసం ఎదురుచూడటం తప్ప వేరే ఆప్షన్ కనిపించలేదు. ఆ నాలుగేళ్ల కాలంలో నిశ్చింతగా ఉన్నానని చెబితే అది ఖచ్చితంగా అబద్ధమే అవుతుంది. కానీ మహేష్‌ను పెళ్లి చేసుకోవడం పక్కా అని నాకు తెలుసు. ఒక వేళ అదే జరగకపోయుంటే.. నేను ఎవ్వరిని పెళ్లి చేసుకోకపోయేదాన్ని. అతను కూడా అంతే ష్యూర్‌గా ఉంటాడని నాకు తెలుసు.. అంటూ చెప్పుకొచ్చింది నమ్రతా.

అదే జంట.. టాలీవుడ్‌లో మోస్ట్‌ బ్యూటిఫుల్‌ కపుల్‌గా నిలిచింది.
మరి 15 ఏళ్లు ఎలా గడిచిపోయాయంటే.. రోజూ ఎప్పుడు లేస్తున్నానో.. ఎప్పుడూ పడుకుంటున్నానో కూడా తెలియలేదు.. మీకు తెలుసా.. నాకు జీవితంలో ఇంకేం అవసరం లేదనిపించింది.. నా భర్త.. ఇద్దరు పిల్లలే నా ప్రపంచం.. మీకైదేనా ఖాళీ దొరికితే ఏం చేస్తారు అని ప్రశ్నిస్తే.. నాకు ఆ ఖాళీ వద్దని చెబుతా. ఫ్రెండ్స్‌తో కబుర్లు చెప్పడం వద్దు. అసలు మహేష్‌కు దూరంగా ఉండటమనేది వద్దే వద్దు. రెండు రోజులు మహేష్‌ కనిపించకపోతే చాలు. తనను మిస్‌ అవుతా. నా మ్యారేజ్‌ లైఫ్‌ను పక్కన పెట్టి అడ్వెంచర్‌లు, యాత్రలు చేసే శక్తి లేదు.

మహేష్‌ కేరీర్‌కు సంబంధించిన నిర్ణయాలు మీరు తీసుకుంటారా? అని అడిగితే లేదనే చెపుతాను. మహేష్‌ స్క్రిప్ట్‌లను సెలెక్ట్‌ చేస్తాననేది ఓ పెద్ద అబద్ధం. నాకే అంత స్క్రిప్ట్‌లను సెలెక్ట్‌ చేసే టేస్ట్‌ ఉంటే.. బాలీవుడ్‌లో నేను కొన్ని దారుణమైన సినిమాల్లో ఎలా నటిస్తాను చెప్పండి అంటోంది నమ్రతా..

మరి లైఫ్‌లో ఏదైనా తీరని కోరిక ఉందా అంటే.. క్షణం ఆలస్యం చేయకుండా నో అంటోంది నమ్రతా. నా లైఫ్‌లో మహేష్‌ డ్రీమ్‌ లాంటి వాడు. ఆ డ్రీమ్‌ను మిస్‌ చేసుకోదలుచుకోలేదు.. ఆ కల చెదరకుండా ఉండటానికి అసలు నిద్రలో నుంచే లేవను. నేను – మహేష్‌ పెళ్లికి ఎంత విలువ ఇస్తామో.. నా పిల్లలు కూడా అంతే విలువ ఇవ్వాలనేది నా కోరిక. ఇండస్ట్రీలో ఎన్నో ఘటనలు చూస్తున్నాం. ఆ విషయం నేను కూడా ఒప్పుకుంటాను. కానీ మహేష్‌, నేను ఒకరి ప్రాణం ఒకరిలో ఉందని భావిస్తాం.. అంటోంది.

మహేష్‌ అంటే ప్రేమ..
మహేష్‌ అంటే ఆరాధన..
మహేష్‌ ఓ మానవతావాది..
మహేష్‌ నాకు ఎప్పుడూ అండగా నిలిచే జీవిత భాగస్వామి..
పిల్లల్ని ప్రేమించే గొప్ప తండ్రి మహేష్‌..
జీవితంలో నాకు దక్కిన గొప్ప అదృష్టం ఏదైనా ఉందంటే.. అది మహేష్‌ను కలవడమంటూ ఎన్నో మధురస్మృతులను గుర్తు చేసుకోంటోంది ఘట్టమనేని నమ్రతా శిరోద్కర్‌.