Updated On - 3:12 pm, Tue, 23 February 21
Bheeshmacharya: నేడు భీష్మ ఏకాదశి సందర్భంగా నటసింహ నందమూరి బాలకృష్ణ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రంలో తాను భీష్ముని పాత్రలో నటించిన స్టిల్స్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘భీష్మ పాత్రంటే నాకెంతో ఇష్టం. నాన్న గారు, ఆయన వయసుకి మించిన భీష్మ పాత్ర పోషించి ప్రేక్షకుల విశేష ఆదరాభిమానాలను అందుకున్నారు. ఆ చిత్రం, అందులో నాన్నగారు నటించిన భీష్ముని పాత్ర అంటే నాకెంతో ఇష్టం. అందుకనే ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రంలో భీష్ముని సన్నివేశాలు తీశాము. అందులో నేను భీష్మునిగా నటించాను.
అయితే నిడివి ఎక్కువ అవడం వలన ఆ చిత్రంలో ఆ సన్నివేశాలు ఉంచడం కుదరలేదు. ఇవాళ భీష్మ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆ పాత్రకి సంబంధించిన ఫోటోలను ప్రేక్షకులతో, అభిమానులతో పంచుకోవాలనుకుంటున్నాను’’.. అన్నారు..
#NandamuriBalakrishna garu as ‘Bheeshmacharya’ from #NTRKathanayakudu movie. pic.twitter.com/d1VW2QswFk
— NBK FILMS (@NBKFilms_) February 23, 2021