లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

‘అంటే సుందరానికీ’ ఏమైంది?

Published

on

Nani’s Ante Sundaraniki Title Poster: నేచురల్‌ స్టార్‌ నాని, వివేక్‌ ఆత్రేయ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. నాని 28వ చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ సినిమా కర్టెన్‌ రైజర్‌ను శనివారం చిత్ర యూనిట్‌ విడుదల చేస్తూ.. టైటిల్‌ అనౌన్స్ చేశారు.


నాని 28వ చిత్రానికి ‘అంటే సుందరానికీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ కర్టెన్‌ రైజర్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. హర్షవర్ధన్‌, సుహాస్‌ మధ్య ఏదో సీక్రెట్‌ డిస్కషన్‌ జరిగినట్లు చూపిస్తూ.. ఆసక్తికరంగా టైటిల్‌ ‘అంటే సుందరానికీ’ అని రివీల్‌ చేశారు. పోస్టర్లో వీణ, సైకిల్, కెమెరా, జాడీలు వంటివి చూపించారు.Imageనాని ట్రావెల్ బ్యాగ్‌ పట్టుకుని వెనక్కి తిరిగి నిలబడిఉన్నాడు. పల్లెటూరి గెటప్‌లో పంచెకట్టుతో కనిపిస్తున్నాడు. త్వరలోనే సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుందని, 2021లో విడుదల చేయనున్నారు. ఇంతకు ముందు తన సినిమాలో చూడని లవ్‌, నవ్వులను ఈ సినిమాలో చూస్తారంటూ నాని ట్వీట్‌ చేశారు.


అల్లు అర్హ ‘అంజలి అంజలి’ సాంగ్ చూశారా!


మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ మ్యూజిక్, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *