Nara Lokesh To Contest From Ichachapuram

డైరెక్ట్‌గా వస్తున్నా : ఇచ్చాపురం నుంచి నారా లోకేష్ పోటీ?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కంచుకోట. మూడు దశాబ్దాల్లో ఆరుసార్లు ఎన్నికలు జరిగితే….ఐదు సార్లు టీడీపీకే ప్రజలు పట్టం కట్టారు. అయితే.. జిల్లా నాయకత్వం సమన్వయ లోపం కారణంగా వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. మారుతున్న సమీకరణాలతో…ఇచ్చాపురంలో ఎవరు పోటీ చేస్తారు ? టికెట్ ఎవరెవరు ఆశిస్తున్నారు ? తెలుగుదేశం పార్టీ తన పట్టు నిలుపుకుంటుందా? అనే ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి.

ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గం….శ్రీకాకుళం జిల్లాకు చివరలో…ఒడిషా సరిహద్దుల్లో ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎవరు పోటీ చేస్తారన్న దానిపై క్లారిటీ లేదు. ఈ నియోజకవర్గంలో ఆరుసార్లు ఎన్నికలు జరిగితే….ఐదు పర్యాయలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వైద్యుడు బెందాళం అశోక్‌ కుమార్…విజయం సాధించారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఈ అసెంబ్లీ సీటును ముగ్గురు నేతలు ఆశిస్తున్నారు.

2014లో బెందాళం 20వేల మెజార్టీతో వైసీపీ అభ్యర్థిపై గెలుపొందడంతో….ఈ సారి కూడా అతడికే టికెట్ ఇస్తే ఈజీగా గెలుస్తామని పార్టీ శ్రేణులు ఉన్నాయి. కళింగ సామాజిక వర్గానికి చెందిన అశోక్‌ను కాదని….కొత్త అభ్యర్థికి సీటు కేటాయిస్తే ఫలితం తారుమారయ్యే అవకాశం ఉంది. ఇదే స్థానాన్ని రెడ్డి, యాదవ సామాజిక వర్గాలకు చెందిన నేతలతో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష ఆశిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి నారా లోకేశ్‌ను ఇక్కడి నుంచే పోటీ చేయించేందుకు ముఖ్య నేతలు ప్లాన్ చేస్తున్నారు.

ఇచ్చాపురం సీటును ఎలాగైనా కైవసం చేసుకోవాలని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. అందుకనుగుణంగా మాజీ ఎమ్మెల్యే, కళింగ సామాజిక వర్గానికి చెందిన పిరియా సాయిరాజ్‌ను పార్టీలోకి ఆహ్వానించి….ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించింది. వైసీపీ గెలుపు బాధ్యతలను మాజీ కన్వీనర్ నర్తు రామారావు, వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నరేశ్‌ కుమార్‌కు అప్పగించింది. జగన్ పాదయాత్ర కూడా ఇచ్చాపురంలోనే ముగియడంతో…వైసీపీ సాయిరాజ్‌ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బెందాళంకే మళ్లీ సీటు కేటాయిస్తుందా ? లేదంటే అభ్యర్థిని మారుస్తారా అన్న దానిపై పార్టీ అధిష్ఠానం ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. 2014 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన తనకే సీటు ఇవ్వాలంటూ…పార్టీ నేతలను కోరుతున్నారు అశోక్‌కుమార్. రూ.500 కోట్ల అభివృద్ధి పనులతో పాటు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని…ఇదే తన విజయానికి బాటలు వేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అటు వైసీపీ అభ్యర్థి గెలుపు బాధ్యతలను నలుగురికి అప్పగించినా…వారంతా కలిసి పని చేస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇటు తెలుగుదేశం పార్టీ సిట్టింగ్‌‌కే టికెట్ ఇస్తుందా? లేదంటే కొత్త వారికి కేటాయిస్తుందా అన్న దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. టీడీపీ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారో తెలియాలంటే.. కొంత కాలం ఆగాల్సిందే.

READ  క్రాస్‌ రోడ్‌లో కాంగ్రెస్ : సైకిల్ ఎక్కుతున్న నేతలు

Related Posts