ప్రజలను ప్రాంతాల వారీగా విభజించి రెచ్చగొడుతున్నారు, జగన్ ప్రభుత్వంపై లోకేష్‌ ఫైర్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

nara lokesh : పసిబిడ్డలాంటి అమరావతిని చంపేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆరోపించారు. అమరావతి ఉద్యమాన్ని కించపరిచేలా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు వారి పోరాటంలో ముందుంటామని అన్నారు. అమరావతి రైతుల ఉద్యమం 300 రోజుకు చేరిన సందర్భంగా… పెనుమాకలో నిర్వహించిన ధర్నాల్లో లోకేష్‌ పాల్గొన్నారు. రైతులు, మహిళలకు సంఘీభావం ప్రకటించారు. రాష్ట్ర ప్రజలను సీఎం జగన్‌ ప్రాంతాల వారీగా విభజించి రెచ్చగొడుతున్నారని లోకేష్‌ మండిపడ్డారు. నాడు అన్ని ప్రాంతాలకు సమీపంలో ఉన్న ప్రాంతాన్నే రాజధానిగా ఎంపిక చేశామని స్పష్టం చేశారు.

Related Tags :

Related Posts :