లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

నారా లోకేష్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

Published

on

Nara Lokesh Narrow Escape : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. లోకేష్ కు తృటిలో ప్రమాదం తప్పింది. సిద్దాపురంలో లోకేష్ ట్రాక్టర్ నడిపారు. ఆ సమయంలో ట్రాక్టర్ అదుపు తప్పి ఉప్పుటేరు కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే తేరుకున్న టీడీపీ నేతలు ట్రాక్టర్ ను అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది. లోకేష్ కు ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఆకివీడు మండలం సిద్ధాపురం దగ్గర లోకేష్ ట్రాక్టర్ నడిపారు. అయితే ట్రాక్టర్ అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న ఉప్పుటేరు కాల్వలోకి దూసుకెళ్లింది. పక్కనే ఉన్న ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు తక్షణమే అప్రమత్తమై ట్రాక్టర్‌ను అదుపు చేశారు. అనంతరం లోకేష్‌ను ట్రాక్టర్‌ నుంచి దింపేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో లోకేష్ సెక్యూరిటీ సిబ్బంది, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.

లోకేష్ సోమవారం(అక్టోబర్ 26,2020) పశ్చిమ గోదావరి జిల్లాలో వరద ప్రభావిత గ్రామాల్లో పర్యటిస్తున్నారు. పార్టీ నేతలు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజుతో కలిసి ఆయన ట్రాక్టర్ పై వెళ్లారు. లోకేష్ ట్రాక్టర్ నడుపుతున్న సమయంలో ట్రాక్టర్ అదుపు తప్పింది. ఈ ఘటన తర్వాత యథావిధిగా లోకేష్ పర్యటన కొనసాగింది.

రూ.8 కోట్ల విలువ చేసే 40 ఎకరాల ప్రభుత్వ భూమిని లోకేష్ బంధువు ఆక్రమించారు


రాష్ట్రంలో వరద తీవ్రతపై లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా ఈరోజు భారీ వర్షాల వల్ల కొల్లేరు సరస్సు ముంపునకు గురైన శృంగవరప్పాడు బాధితులను కలుసుకున్నా. గ్రామం అంతా మోకాలి లోతు నీళ్లు. నిత్యావసర సరుకులు కూడా అందని పరిస్థితి. ఇన్ని రోజుల తర్వాత కూడా ఇంత నిర్లక్ష్యమా? గ్రామస్తులకు ప్రభుత్వ సాయం అందించడం సంగతి అటుంచి.. కనీసం నాయకులు, అధికారులు వచ్చి ఇంతవరకు పలకరించిన పాపాన పోలేదు. గ్రామానికి వైద్య సదుపాయాలు లేక విష జ్వరాలు సోకి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని ఆవేదనతో గ్రామస్తులు చెబుతుంటే కళ్ళు చెమర్చాయి’’ అని ట్వీట్ లో ఆవేదన వ్యక్తం చేశారు లోకేష్.
Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *