లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

రూ.8 కోట్ల విలువ చేసే 40 ఎకరాల ప్రభుత్వ భూమిని లోకేష్ బంధువు ఆక్రమించారు

Published

on

nara lokesh : టీడీపీ నేత నారా లోకేష్ బంధువు భరత్ రూ.8కోట్ల విలువ చేసే 40 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ ఆరోపించారు. ఇప్పుడు ఆ భూమిని అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. ప్రభుత్వ భూమిని తిరిగిన స్వాధీనం చేసుకుంటే దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. భూమి ఆక్రమణకు సంబంధించి 5 నెలల క్రితమే గీతం యాజమాన్యానికి అధికారులు తెలియజేశారని ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయానికి గాంధీ పేరు పెట్టి అక్రమాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ చిన్న అల్లుడు, టీడీపీ నేత అయిన శ్రీ భరత్ గీతం వర్సిటీ ప్రెసిడెంట్ గా ఉన్నారు.

గీతం యూనివర్సిటీలో ఆక్రమణల తొలగింపు:
శనివారం(అక్టోబర్ 24,2020) గీతం యూనివర్సిటీలో ఆక్రమణలను రెవెన్యూ శాఖ అధికారులు తొలగించారు. విశాఖ నగర శివారు రుషికొండ సమీపాన పెద్ద ఎత్తున ప్రభుత్వ భూమిని ఆధీనంలో ఉంచుకున్న గీతం యూనివర్సిటీ నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 40 ఎకరాలు గీతం యూనివర్సిటీ ప్రభుత్వ భూమిని అనుభవిస్తున్నట్లు రెవెన్యూ అధికారుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దీంతో ఆర్డీవో కిషోర్ పర్యవేక్షణలో రెవిన్యూ సిబ్బంది ఉదయం 6 గంటల నుంచి ప్రభుత్వ భూమిని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. వర్సిటీకి వెళ్లే మార్గాన్ని పోలీసులు మూసివేశారు. విశ్వవిద్యాలయ ప్రధాన ద్వారం ప్రహరీ గోడతో పాటు, కొంత భాగం సెక్యూరిటీ గదులను సిబ్బంది కూల్చివేశారు.

40.51 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ:
గీతం విశ్వవిద్యాలయ యాజమాన్యం గుప్పిట్లో 40.51 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయని జిల్లా రెవిన్యూ అధికారులు ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం దృష్టి సారించింది. గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎండాడ, రుషికొండ పరిసరాల్లోని భూముల్ని ఆక్రమించుకుని సంస్థ పరిధిలో కలిపేసుకున్నట్లు రెవిన్యూ అధికారులు గుర్తించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నివేదికని ప్రభుత్వానికి మరోసారి అందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గీతం పరిధిలో కోర్టు కేసుల్లో ఉన్న భూములు ఏఏ గ్రామాల పరిధిలో ఉన్నాయి.? ఆక్రమణలు ఎంత మేర జరిగాయన్నదానిపై నివేదిక అందించనున్నారు.

గీతం యూనివర్సిటీలో ఆక్రమణల తొలగింపు, 40 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా


నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేత:
విద్యా సంస్థల మధ్యలో అండర్‌ పాసేజ్‌ రహదారి నిర్మాణంపైనా అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. రుషికొండ, ఎండాడ గ్రామాల్లో ఉన్న గీతం ఇంజినీరింగ్‌ కాలేజ్‌కి మెడికల్‌ కళాశాలకు అనుసంధానం చేస్తూ సొరంగ మార్గాన్ని నిర్మించేశారు. గత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి.. ఎలాంటి పూర్తి స్థాయి అనుమతులూ తీసుకోకుండా.. జీవో పేరుతో అండర్‌ పాసేజ్‌ నిర్మాణం పూర్తి చేసేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే ప్రభుత్వం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతకు పాల్పడిందని గీతం విద్యాసంస్థల యాజమాన్యం ఆరోపించింది. అసలు కూల్చివేతకు కారణం కూడా చెప్పలేదని గీతం యాజమాన్యం వాపోయింది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *