లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story

సాయంత్రం 6గంటలకు ఓ విషయం చెప్తా….ఆసక్తి రేపుతున్న మోడీ ట్వీట్

Published

on

Modi To Address Nation At 6 pm భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ ఓ ఆశక్తికర ట్వీట్ చేశారు. ఇవాళ(అక్టోబర్-20,2020)సాయంత్రం 6 గంటలకు దేశ ప్రజలకు ఓ సందేశం ఇవ్వబోతున్నట్లు తెలిపారు. , ఏ విషయం మీద మాట్లాడతారన్నది మాత్రం ఆయన ప్రకటించలేదు. అయితే, మోడీ చేసిన ఒక్క లైన్ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏదైనా గుడ్‌న్యూస్ ఉంటుందా లేక కరోనా నేపథ్యంలో కొత్త ఆంక్షలను తీసుకురాబోతున్నారా అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.కాగా, కరోనా, లాక్‌డౌన్ సమయంలో కూడా ప్రధాని ఇలా ఆసక్తికర ట్వీట్‌లు చేసిన విషయం తెలిసిందే. అప్పుడు లాక్‌డౌన్ పొడిగింపు, స్పెషల్ ప్యాకేజీలు వంటి ఇలా కీలక ప్రకటనలు ప్రధాని నోటి నుంచి వచ్చాయి. ఇప్పుడు అన్‌లాక్ ప్రక్రియ నడుస్తోంది.. కరోనా కేసులు కూడా తగ్గుముఖం పట్టాయి.. ఇలాంటి సమయంలో ప్రధాని మోడీ చేసిన ఈ ట్వీట్ ఆసక్తికరంగా మారింది.


మోడీకి సీఎం కేసీఆర్ లేఖ, రైతులను ఆదుకొనేందుకు రూ. 600 కోట్లు ఇవ్వండి


మరోవైపు, దేశంలో వరుస ఈ పండుగల నేపథ్యంలో కరోనా వైరస్ పరిస్థితి గురించి ఆయన ప్రస్తావించవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు సుమారు 76 లక్షలకు చేరుకున్నాయి. అయితే, మొదటిసారిగా మూడు నెలల తరువాత ఒక రోజులో 50 వేలకు తక్కువగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 46,790 కేసులు నమోదైనట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తం కేసులు 75,97,063 అని వివరించింది. గత జులై 23 న 45,720 కేసులు నమోదయ్యాయి.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *