లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

‘స్టాట్యూ ఆఫ్ పీస్’ ఆవిష్కరించిన మోడీ

Published

on

Narendra Modi unveils the ‘Statue of Peace’ in Pali జైన్​ ఆచార్య శ్రీ విజయ వల్లభ సురేశ్వర్​ జీ మహారాజ్​ 151వ జయంతి సందర్భంగా 151 అంగుళాల ఎత్తైన ‘స్టాట్యూ ఆఫ్​ పీస్​’ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజస్థాన్ రాష్ట్రంలోని​ పాళీ జిల్లాలోని విజయ వల్లభ సాధన కేంద్రంలో ‘స్టాట్యూ ఆఫ్​ పీస్​’ విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. అష్టధాతు లోహాలతో విగ్రహాన్ని తయారుచేశారు.శ్రీ విజయ వల్లభ సురేశ్వర్​ మహారాజ్ ఒక జైన్​ ఆచార్యులు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన ఎంతో కృషి చేశారు. ఎన్నో పాటలు, శ్లోకాలు రాశారు. స్వాతంత్య్రోద్యమంలోనూ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ…సర్ధార్ వల్లభ్​భాయ్ పటేల్ మరియు విజయ వల్లభ ఇద్దరూ తమ జీవితాన్ని దేశసేవ కోసం అంకితం చేశారు. సర్దార్ పటేల్ ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’, జైనాచార్య విజయ వల్లభ్ ‘స్టాట్యూ ఆఫ్ పీస్’ విగ్రహాలను ఆవిష్కరించే అవకాశం తనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్లు మోడీ చెప్పారు. ఇద్దరూ దేశ ఐక్యత, సౌభ్రాతృత్వం కోసం జీవితాల్ని అంకితం చేశారన్నారు. మానవత్వం, శాంతి, అహింస, సౌభ్రాతృత్వానికి భారత దేశం ఉదాహరణగా నిలుస్తోంది. యావత్​ ప్రపంచం మనవైపు చూస్తోందని మోడీ అన్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *