లాకప్ డెత్ బాడీ కోసం 44కిలోమీటర్ల కాలువను ఖాళీ చేశారు!!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

స్టేట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID) Narmada ప్రధాన కాలువను ఖాళీ చేయాలని రిక్వెస్ట్ పెట్టింది. ఈ మేరకు సర్దార్ సరోవర్ నర్మదా నిగమ్ లిమిటెడ్ (SSNNL) ను ఖాళీ చేయనున్నారు. వడోదరాలో తెలంగాణ వలస కార్మికుడైన బాబు షేక్ నిస్సార్ (65) అనే వ్యక్తి లాకప్ డెత్ విచారణలో భాగంగా సీఐడీ ఈ దర్యాప్తు చేపట్టింది.

ఈ కారణంగా దాదాపు వడోదరా సిటీలో ఉండే వారికి మంగళవారం నుంచి 24గంటల పాటు నీరు లేకుండానే గడపాలి. ఈ కాలువ నుంచి ఖాన్పూర్ నుంచి ఫ్రెష్ వాటర్ సప్లై అవుతుంది. వడోదరా ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ (వీఎఫ్ఈఎస్) డిపార్ట్‌మెంట్ సీఐడీ రిక్వెస్ట్ తర్వాత మృతదేహాన్ని వెతికే పనిలో పడింది.వడోదరా లోకల్ కోర్ట్ ఈ విషయాన్ని సెప్టెంబర్ 11న ఖండించగా.. సీఐడీ ఆరుగురు పోలీసుల రిమాండ్ ను పొడిగించాలని ప్లీ పెట్టుకుంది. ఫతేగంజ్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఇన్‌స్పెక్టర్ డీబీ గోహిల్, సబ్ ఇన్‌స్పెక్టర్ డీఎం రబారీ, లోక్ రక్షక్ దాల్ జవాన్స్ పంకజ్ మావ్జీభాయ్, యోగేంద్ర సావ్జీభాయ్, హితేశ్ శంబూభాయ్ లను అదుపులోకి తీసుకున్నారు.

బలంగా అనుమానాలు:
సెప్టెంబర్ 2న సీఐడీకీ సరెండర్ అయినప్పటికీ ఇన్వెస్టిగేషన్ కు సహకరించకుండా నిరాకరించారు. నిందితుల మొబైల్ సిగ్నల్స్, లొకేషన్ ఆధారంగా వడోదరాలో ఉన్న గోర్వా ప్రాంతానికి సమీపంలోని కెనాల్ లో నిసార్ శవాన్ని పడేసి ఉండాలని అనుమానిస్తున్నారు.

ఇందుకోసం చాలా వాహనాలు వాడినట్లుగా తెలుస్తుంది. వాటిల్లో ఒకటి హెడ్ కానిస్టేబుల్ మహేశ్ రాత్వాకు చెందిన హ్యాచ్ బ్యాక్ కార్. అతను ఈ కేసులో నిందితుడు కాదు. సీఐడీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్.. ఎస్ఎస్ఎన్ఎన్ఎల్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ ను కన్ఫామ్ చేస్తూ.. మేం ఎస్ఎస్ఎన్ఎన్ఎల్ ను ఖాళీ చేయాలని అడిగాం. సంబంధిత ఫైర్ డిపార్ట్‌మెంట్ ఆ పనిలోనే ఉంది’ అని పాండ్యా తెలిపారు.

కుదరదని చెప్పేశాం:
వీఎంసీ అడిషనల్ సిటీ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అమృత్ మక్వానా.. ఈ కారణంగా వాటర్ సప్లై మూడు రోజుల వరకూ రాకుండా ఉంటుందని అన్నారు. కెనాల్ 44కిలోమీటర్ల పొడవు ఉంది. సీఐడీ మొత్తం మూడు రోజుల పాటు వాటర్ సప్లై ఆపేయాలని అడిగింది. కానీ, మూడు రోజుల పాటు నీటి సప్లై ఆపి ఉంచడం కుదరదని.. కాన్పూర్ నుంచి వచ్చే 75మిలియన్ లీటర్ల నీరు 5లక్షల మందికి అందాల్సి ఉందని చెప్పాం. అందుకని కేవలం ఒకరోజు మాత్రమే ఆపడానికి ఒప్పుకున్నాం. ఆ సమయంలోనే వారు సెర్చింగ్ పూర్తి చేయాలి’ అని అన్నారు.

ఈ నీరే కీలకం:
వడోదరా నుంచి ప్రవహిస్తున్న ఈ కాలువ చ్ఛానీ నుంచి సేవాసి వరకూ పోతుంది. సిటీ వెస్ట్, సౌత్ జోన్ల నుంచి నీళ్లు అనేవి వస్తూ ఉంటాయి. గోత్రీ, హరినగర్, వాస్నా, తండాల్జా, సుభాన్‌పురా, అకోటా, అట్లాదరా, కలాలి, వాడ్సార్, మంజల్‌పూర్ లకు ఈ నీరే ప్రధానం.

సరిపడనంత కాలువ ఎండిపోతే.. ‘మేం మునిసిపల్ కమిషనర్ ఇచ్చిన నిబంధనల ప్రకారం.. సెర్చింగ్ మొదలుపెడతాం. అని సీఐడీ నుంచి విషయం తెలుసుకున్న’ బ్రహ్మాభట్ అన్నారు.

బతకడని అప్పుడే అనుకున్నా:

నిసార్‌ను ఫతేగంజ్ పోలీసులు దొంగతనం నేరం కింద పట్టుకున్నారు. అంతకుముందే అంటే 2019 డిసెంబర్ 10 నుంచే ఆయన కనిపించకుండాపోయారు. అసిస్టెంట్ హెడ్ కానిస్టేబుల్ శక్తిసిన్హా మాట్లాడుతూ.. ఆరుగురు పోలీసులు నిసార్ ను కుర్చీకి కట్టేసి కదలకుండా చేయడం, టార్చర్ పెట్టడం చూశానని అన్నారు. నిందితులు నిసార్ వేళ్లలో పెన్ను పెట్టి టార్చర్ పెడుతూ.. రక్తం మొత్తం కారేంత వరకూ, వాయీస్ ఆగిపోయేంత వరకూ హింసించారు. ఆ తర్వాత బతుకుతాడని నేను అనుకోలేదని అతను ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నాడు.

కేసు చేతులు మారిందిలా:
నిసార్ కొడుకు పోలీస్ కమిషనర్‌కు అప్లికేషన్ సబ్‌మిట్ చేశాడు. వడోదరా సిటీ నుంచి కనిపించకుండా పోయిన తన తండ్రి గురించి ఎటువంటి విచారణ జరపకపోవడంతో ఏ ముగింపు లేకుండాపోయింది అని గుజరాత్ పోలీసులకు వెల్లడించారు. 2020 జూన్ 20న ఫ్యామిలీపై గుజరాత్ హైకోర్టులో హెబ్యాస్ కార్పస్ పిటిషన్ వేశారు. జూన్ 25న రెండు విచారణలను వడోదరా డివిజన్ కు అప్పగించింది. ఆగష్టు 6న గుజరాత్ హైకోర్టు విచారణ జరిపి సీఐడీకి అప్పగించింది.

Related Tags :

Related Posts :