Narnia the two faced cat fathers kittens that match his two faces cute cats

పిల్లికూనల వైరల్ ఫోటో: నాన్నలో నువ్వో సగం..నేనో సగం భలేభలే..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రెండు బుజ్జి పిల్లికూలన ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద వైరల్ గా మారిపోయాయి. క్యూట్ క్యూట్ గా ఎంతో ముచ్చటగొలిపే ఈ పిల్లికూనలు తండ్రిపోలికలను పంచుకుని పుట్టాయి. ఇది పెద్ద విశేషం కాదు. కానీ తండ్రి పిల్లిలోని రెండు రంగులను రెండూ పంచేసుకుని పుట్టాయా అన్నట్లుగా ఉంది వీటిని తండ్రి పిల్లిని పక్కపక్కన పెట్టి చూస్తే. తండ్రి పిల్లి ఏదో పెయింట్ వేసినట్లుగా..సగానికి ఒకరంగు..మరో సగానికి మరో రంగుతో ఉంది. 

తండ్రి రంగులో నువ్వో సగం నేనో సంగం అన్నట్లుగా పుట్టాయి ఈ పిల్లిపిల్లలు. నలుపు, బూడిద రంగులను పనిగట్టుకుని ముఖంపై సగం సగం పూసినట్లు ఉండే నార్నియా అనే మగ పిల్లి తండ్రి అయ్యి మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. అదిజతకట్టిన ఆడపిల్లికి పుట్టిన రెండు పిల్లలే ఇందుకు కారణం. ఒక పిల్ల పూర్తిగా నల్లరంగులో పుట్టగా, మరొకటి తెల్లరంగులో పుట్టింది. నార్నియాను, ఆ పిల్లలను పక్కనపక్కన పెట్టి చూస్తున్న జనం ముక్కుపైన వేలేసుకుంటున్నారు. తన రెండు రంగులను అది ఎంతచక్కగా షేర్ చేసి ఇచ్చిందో కదా అంటున్నారు. 

బ్రిటన్‌కు చెందిన స్టెఫనీ జిమినెజ్ అనే మహిళ నార్నియాను పెంచుకుంటోంది. దానికిప్పుడు మూడేళ్ల వయసు. హాఫ్ బ్లాక్, హాఫ్ వైట్ (బూడిద..రంగు కలగలిపి) ముఖంతో అది సోషల్ మీడియాలో ఇప్పటికే సెలబ్రిటీ. రెండుముఖాల పిల్లిగా పేరు కొట్టేసింది. నార్నియా లాంటి పిల్లులు, వాటికి ఇలాంటి పిల్లలు పుట్టడం చాలా అరుదని డాక్టర్లు కూడా చెబుతున్నారు. దాని రంగులే దాన్ని సెలబ్రిటీని చేసేస్తే..ఇప్పుడు దానికి పుట్టిన రెండు పిల్లి కూనలు తండ్రిరంగులను పంచుకుని పుట్టి తండ్రికి మరింత పేరు తెచ్చిపెట్టాయి.

Read: డ్యాన్స్ చేస్తూ కొత్తిమీర అమ్మిన నటుడు

Related Posts