NASA Moon Orbiter Fails to Spot India’s Lunar Lander: Report

చంద్రయాన్-2 ఫెయిల్ అయినట్టేనా? : విక్రమ్ ల్యాండర్ డెడ్? : చేతులేత్తేసిన నాసా!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

చంద్రునిపై నీళ్లు ఉన్నాయా? భూగ్రహం మాదిరిగా అక్కడ మనుషులు నివసించేందుకు అనుకూలమైన వాతావరణం ఉందా? ఇలా ఎన్నో ప్రశ్నలకు ప్రశ్నలే సమాధానాలుగా మిగిలిపోయాయి.

చంద్రునిపై నీళ్లు ఉన్నాయా? భూగ్రహం మాదిరిగా అక్కడ మనుషులు నివసించేందుకు అనుకూలమైన వాతావరణం ఉందా? ఇలా ఎన్నో ప్రశ్నలకు ప్రశ్నలే సమాధానాలుగా మిగిలిపోయాయి. చంద్రయాన్-2 ప్రయోగం సక్సెస్ అయిందనే సంతోషం క్షణాల్లోనే ఆవిరైపోయింది. చంద్రుని ఉపరితలంపై అదృశ్యమైన విక్రమ్ ల్యాండర్ డెడ్ అయిన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఇస్రో అభ్యర్థన మేరకు రంగంలోకి దిగిన నాసా కూడా విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కనిపెట్టలేక చేతులేత్తేసింది. నాసా ఆర్టిటర్ (LRO) తీసిన ఛాయ చిత్రాల్లో ఎక్కడ కూడా విక్రమ్ ఆనవాళ్లు కనిపించలేదు. అంతా చీకటిగా ఉండటంతో ఇస్రో టార్గెటెడ్ స్పాట్ లో విక్రమ్ దృశ్యాలను నాసా గుర్తించలేకపోయింది.  ప్రపంచమంతా భారత్ వైపు ఆసక్తిగా చూసిన వేళ.. ఆఖరి క్షణాల్లో చంద్రుని ఉపరితలంపై దిగాల్సిన విక్రమ్ ల్యాండర్ అకస్మాత్తుగా అదృశ్యమైంది. ల్యాండర్ సిగ్నల్స్ కట్ కావడంతో స్తబ్ధత నెలకొంది. 

అప్పటి నుంచి ఇస్రో సైంటిస్టులు విక్రమ్ ల్యాండర్ ను కనిపెట్టేందుకు చేయని ప్రయత్నం లేదు. చివరికి నాసా కూడా రంగంలోకి దిగిన ఫలితం లేకుండా పోయింది. సెప్టెంబర్ 6న చంద్రునిపై ల్యాండ్ అయ్యే క్రమంలో ల్యాండర్ క్రాష్ అయినట్టుగా కనిపించింది. ల్యాండర్ ఒక్కసారిగా అదృశ్యమైపోయింది. విక్రమ్ నుంచి పూర్తిగా సిగ్నల్స్ కట్ అయ్యాయి. విక్రమ్ సేఫ్ గానే ఉందని, ఒకటిగానే ఉందని ఇస్రో బలంగా నమ్ముతున్నప్పటికీ చంద్రుని ఉపరితలంపై ఎక్కడ ల్యాండ్ అయిందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఇస్రోకు సాయంగా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) రంగంలోకి దిగింది. 

అదృశ్యమైన విక్రమ్ ల్యాండర్ కోసం నాసా విస్తృతంగా గాలించింది. నాసా ఆర్బిటర్ షెడ్యూల్ ప్రకారం.. మంగళవారం (సెప్టెంబర్ 17)న చంద్రుని ఉపరితలానికి చేరుకుంది. చంద్రుని ఉపరితలంపై ల్యాండర్ ఉన్న ప్రాంతాన్ని నాసా (ల్యూనర్ రీకానాయేషియన్స్ ఆర్బిటర్ (LRO) విక్రమ్ ల్యాండర్ ఉన్న ప్రాంతాన్ని క్యాప్చర్ చేసి ఫొటోలను రిలీజ్ చేయాల్సి ఉంది. ఇస్రో టార్గెట్ చేసిన చంద్రుని దక్షిణ భాగాన్ని తాకిన విక్రమ్ ల్యాండర్ ప్రాంతాన్ని గుర్తించడంలో నాసా మూన్ ల్యాండర్ విఫలమైంది. నాసా తీసిన ఫొటోల్లో విక్రమ్ ఆచూకీ దొరకలేదని ఏవియేషన్ వీక్ మార్క్ కరేయు రిపోర్టు తెలిపింది. అదే ప్రాంతంలో సుదీర్ఘ దూరంలో ఛాయలు కమ్మేసి ఉండటంతో సైలెంట్ అయిన విక్రమ్ ను గుర్తించలేకపోయినట్టు రిపోర్టులో పేర్కొంది. 

READ  విరేచనాలు, వికారం లేదా వాంతులు.. తొలి కరోనా లక్షణం ఇదే కావొచ్చు

నాసా LRO వ్యూలో విక్రమ్ అనవాళ్లు కనిపించలేదని నాసా ఒక ప్రకటనలో తెలిపింది. నాసా పాలసీ ప్రకారం.. అన్ని LRO డేటాలు పబ్లిక్ గా అందుబాటులో ఉంటాయని ఎర్జోనా స్టేట్ యూనివర్శిటీకి చెందిన LROC లీడ్ ఇన్విలేజేటర్ మార్క్ రాబిన్ సన్ చెప్పారు. చంద్రయాన్-2 ప్రయోగంలో ఇస్రో టార్గెట్ చేసిన విక్రమ్ ల్యాండింగ్ ప్రాంతానికి సంబంధించి అంతకుముందు… ఆ తర్వాతి ఫొటోలను నాసా షేర్ చేసింది. సెప్టెంబర్ 17, LRO ఫ్లైఓవర్ ప్రాంతంలో స్థానిక చంద్రుని సమయం ప్రకారం.. అతి తక్కువ కాంతి ప్రసరణ ఉండటంతో అక్కడి వాతావరణాన్ని ఫొటోలు తీయడం సవాల్ గా మారినట్టు ప్రకటనలో తెలిపింది. 

చంద్రుని ఉపరితలంపై ల్యాండింగ్ సమయంలో క్రాష్ అయిన విక్రమ్ ల్యాండర్ ఇంతకీ ఏమైంది అనేది మిస్టరీగా మారింది. విక్రమ్ సైలెంట్ అయి రెండు వారాలు కావొస్తోంది. ఇప్పటివరకూ విక్రమ్ నుంచి ఎలాంటి సిగ్నల్స్ రాక పోవడంతో అది డెడ్ అయి ఉండవచ్చుననే సందేహాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. నాసా కూడా విక్రమ్ ఆచూకీ గుర్తించడంలో విఫలం కావడంతో సందేహాలు మరింత వ్యక్తమవుతున్నాయి. విక్రమ్ ల్యాండర్ క్రాష్ అయినప్పటికీ..  ఆర్బిటర్ మాత్రం మరో ఏడేళ్లు చంద్రుడి చుట్టూ పరిభ్రమించనుంది. చంద్రయాన్-2 ప్రయోగం ఫెయిల్ అయినట్టేనా? విక్రమ్ ల్యాండర్ స్టేటస్ ఏంటి? అనేది ఇస్రో అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. 

చంద్రయాన్ 2 ప్రయోగానికి సంబంధించి ఇస్రో తాజాగా స్పందించింది. అధికారిక ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేసింది. ఇస్రో ప్రయోగంలో విక్రమ్ ల్యాండర్ కమ్యూనికేషన్ పూర్తిగా కోల్పోయినట్టే అనే అభిప్రాయానికి వచ్చింది. ల్యాండర్ కమ్యూనికేషన్ లేకపోయినప్పటికీ.. చంద్రయాన్-2 ఆర్బిటర్ పూర్తి స్థాయిలో సంతృప్తి కోసం షెడ్యూల్ చేసిన సైన్స్  ప్రయోగాలు చేస్తూనే ఉంటుంది. ఇలోగా నేషనల్ కమిటీ ఆఫ్ అకాడమిషియన్స్, ఇస్రో నిపుణులు విక్రమ్ ల్యాండర్ కమ్యూనికేషన్స్ కోల్పోవడానికి గల కారణాలపై విశ్లేషిస్తుంటారని నాసా తెలిపింది. 

Related Posts