లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story-1

ఆస్టరాయిడ్ చేజారిపోతోంది..! లీకైన నమూనాలపై నాసా పరిశోధన!

Published

on

ప్రపంచ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గ్రహశకలం నుంచి లీకైన కొన్ని నమూనాలను సేకరించింది. భూమికి 33కోట్ల కిలో మీటర్ల దూరంలో ఉల్క నుంచి మట్టి నమూనాలను సేకరించింది. గ్రహశకలంలోని చాలా పదార్థాలకు సంబంధించి నమూనాలపై లోతుగా నాసా పరిశోధించనుంది. గ్రహశకలంలో ఒక రాతి చీలిక ఉన్నట్టుగా గుర్తించింది.ఆ చీలిక ద్వారా రాళ్ళు అంతరిక్షంలోకి తిరిగి చిమ్ముతున్నాయని నాసా అధికారులు గుర్తించారు. రోబోటిక్ ఆర్మ్, OSIRIS-REx బెన్నూపై శిథిలాల్లో రాళ్లతో కూడిన మేఘాన్ని తాకింది. భూమి నుంచి 200 మిలియన్ మైళ్ళు (320 మిలియన్ కిమీ) దూరంలో ఈ గ్రహశకలం ఉంది. భూమికి తిరిగి వచ్చే క్రమంలో సేకరణ పరికరంలో శకలం పదార్థం ఒకటి చిక్కుకుంది.కానీ అంతరిక్ష నౌక సేకరణలో ఫొటోలు భూ నియంత్రణలోకి తిరిగి వచ్చాయని గుర్తించారు. శాస్త్రవేత్తలు ఊహించిన దానికంటే ఎక్కువ శకలం రాళ్లు చిక్కుకున్నాయని నిర్ధారణకు వచ్చారు. నాసా ఫొటోల్లో అంతరిక్షంలోకి గ్రహశకలం శిలలను వెదజల్లుతున్నట్టు కనిపిస్తోంది.

గ్రహశకలం లీకేజీలో OSIRIS-REx మిషన్ బృందం.. చిందుతున్న శిలలను నివారించడానికి సేకరణ పరికరాన్ని ఉంచడానికి ప్రయత్నించిందని నాసా సైన్స్ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ Thomas Zurbuchen అన్నారు. ప్రణాళిక ప్రకారం.. సేకరించిన పదార్థాన్ని కొలవడానికి మిషన్ బృందాలు స్థిరమైన దశకు చేరుకుంటాయని జుర్బుచెన్ చెప్పారు.ఈ ప్రక్రియలో నమూనా సేకరణ.. కంటైనర్‌ను అంతరిక్ష నౌకలో సురక్షితమైన స్థితిలో ఉంచుతుంది. 2023లో నమూనా క్యాప్సూల్ తిరిగి వచ్చే వరకు ఎంత పదార్థాన్ని సేకరించిందో తెలియదని అంటున్నారు.రాతి పరిమాణంపై తలుపు మాదిరిగా కనిపించే గ్రహ శకలం నుంచి నమూనాలు బయటకు చిందుతున్న ఫొటోలను గుర్తించారు. లాక్హీడ్ మార్టిన్ నిర్మించిన సుమారు 800 మిలియన్ డాలర్ల మినీవాన్-పరిమాణ OSIRIS-REx అంతరిక్ష నౌకను 2016లో ప్రయోగించారు.ఈ స్పెస్ క్రాఫ్ట్.. మొదటి అమెరికా మాదిరిగా గ్రహశకలం నమూనాలను తీసుకుని భూమిపైకి తిరిగి వచ్చింది. ఆ ఘనత సాధించిన ఏకైక దేశం జపాన్ మాత్రమే. 4.5 బిలియన్ ఏళ్ల క్రితం సౌర వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి మిగిలిపోయిన శిథిలాలలో గ్రహశకలాలు ఉన్నాయి.

ఒక గ్రహ శకలం నమూనా భూమిపై జీవం మూలానికి గల ఆధారాలను గుర్తించవచ్చునని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆ దిశగా ప్రయోగాలు చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *