కొత్త విద్యా విధానం, తెలుగు విద్యార్థులకు గుడ్ న్యూస్, 8 ప్రాంతీయ భాషల్లో ఈ-కంటెంట్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

భారత దేశంలోని అన్ని భాషల పరిరక్షణ లక్ష్యంగా కొత్త విద్యా విధానం రూపొందించారు. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్సలేషన్ అండ్ ఇంటర్ ప్రటేషన్, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ పాలి, పర్సియన్, ప్రాక్రిత్, అన్ని భాషలతో పాటు సంస్కృత భాషను బలోపేతం చేసేందుకు ప్రణాళిక రూపొందించారు.

డిజిటల్ ప్రపంచంలో అంతా ఇంగ్లీషే కనిపిస్తోంది. ప్రాంతీయ భాషల్లో లెర్నర్లకు కంటెంట్ లభించడం లేదు. కాగా, కొత్త విద్యా విధానం(National Education Policy-NEP2020)లో మార్పులు తీసుకొచ్చారు. వ్యవస్థను చక్కదిద్దేలా, వివక్ష లేకుండా ఈ-కంటెంట్ ను 8 ప్రాంతీయ భాషల్లో తీసుకురానున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో డిజిటల్ ఎడ్యుకేషన్ కు డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో డిజిటల్ కంటెంట్, టెక్నాలజీని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకున్నారు.

ఆన్ లైన్ లెర్నింగ్ లో చాలా వరకు ఇంగ్లీష్ లేదా హిందీపై ఫోకస్ చేస్తున్నారు. అయితే ఈ కంటెంట్ ను ప్రాంతీయ భాషల్లో అభివృద్ధి చేస్తామని హయ్యర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ అమిత్ కరే తెలిపారు. 8 ప్రాంతీయ భాషలు తమిళం, తెలుగు, కన్నడ, మళయాలం, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ, ఒరియా భాషల్లో ఈ-కంటెంట్ అభివృద్ది చేస్తామన్నారు.

దేశంలోని అన్ని భాషలను ప్రోత్సహించే విధంగా చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు. భారత, క్లాసికల్ భాషల్లో సైంటిఫిక్ లిటరేచర్ ను ప్రమోట్ చేయాల్సిందిగా వివిధ భాషల సంస్థలను కోరతామన్నారు. అలాగే లోక విద్యాను ప్రమోట్ చేయాలని కోరతామన్నారు. మోడ్రన్ ఎడ్యుకేషన్ లో మరిచిపోయిన ప్రాచీన కళను ప్రమోట్ చేయాలని కోరతామన్నారు.

టీచింగ్, లెర్నింగ్, అసెస్ మెంట్ అంశాల్లో కొత్త విద్యా విధానం టెక్నాలజీని ప్రోత్సహిస్తుంది. ప్రస్తుత కరోనా సంక్షోభ పరిస్థితుల్లో ఆన్ లైన్ లో నాణ్యమైన విద్య అందేలా చూస్తామన్నారు. డిజిటల్ ఇన్ఫాస్ట్రక్చర్, డిజిటల్ కంటెంట్ అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. పాఠశాల, ఉన్నత విద్యలో ఈ-ఎడ్యుకేషన్ పై దృష్టి పెట్టనున్నారు.

ఎడ్యుకేష్ అటానమస్ బాడీలో టెక్నాలజీని ప్రోత్సహించేందుకు నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరమ్(NETF) ను ఏర్పాటు చేయనున్నారు. ఇది ఓ ప్లాట్ ఫామ్ ను క్రియేట్ చేస్తుంది. ఆ వేదికపై ఐడియాలను ఎక్స్ చేంజ్ చేసుకోవచ్చు. లెర్నింగ్, అసెస్ మెంట్, ప్లానింగ్, అడ్మినిస్ట్రేషన్ అంశాల్లో టెక్నాలజీ వినియోగం గురించి ఐడియాలను షేర్ చేసుకోవచ్చు.

నూతన విద్యా విధానం-2020 (ఎన్‌ఈపీ-2020)కి బుధవారం(జూలై 29,2020) కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. విద్యా వ్యవస్థలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుడుతూ ఈ విధానాన్ని రూపొందించారు. 34 సంవత్సరాల క్రితం నాటి జాతీయ విద్యా విధానం 1986 స్థానంలో ఇది రూపుదిద్దుకుంది. అందుబాటులో అందరికీ నాణ్యమైన విద్య ప్రధాన లక్ష్యంగా, 2030 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా దీన్ని రూపొందించారు. పాఠశాల, కళాశాల విద్యను 21వ శతాబ్దపు అవసరాలకు అనువైనదిగా తీర్చిదిద్దడంపై ఈ విధానం ప్రధానంగా దృష్టి పెట్టింది. సామాజికంగా, ఆర్ధికంగా అణగారిన వర్గాల వారిపై ఈ విధానంలో ప్రత్యేక దృష్టి పెట్టారు. జీడీపీలో విద్యారంగ కేటాయింపులు కనీసం ఆరు శాతానికి చేర్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

READ  పరీక్షా కాలం : ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్

Related Posts