దుర్గా మండపంలో మహిశాసురుడి తల స్థానంలో గాంధీ తల.. నయా కాంట్రవర్సీకి తెరలేపిన హిందూ మహాసభ

ఈ మండపం ఏర్పాటుపై సోషల్ మీడియా ద్వారా స్పందించిన ఒక జర్నలిస్టుకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారట. ఇలాంటివి షేర్ చేయడం వల్ల సమాజంలో ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందని పోలీసులు చెప్పడంతో సదరు జర్నలిస్ట్ తన ట్వీట్ డిలీట్ చేసుకున్నారు. విచిత్రంగా మండపం ఏర్పాటు చేసిన వారు.. గాంధీని అంతటి ప్రతికూలంగా చూపించినా, గాంధీని అసురుడంటూ దూషించినా స్పందించని పోలీసులు.. జర్నలిస్టుకు వార్నింగ్ ఇవ్వడం గమనార్హం.

దుర్గా మండపంలో మహిశాసురుడి తల స్థానంలో గాంధీ తల.. నయా కాంట్రవర్సీకి తెరలేపిన హిందూ మహాసభ

Controversy: భారత జాతి పిత మహాత్మాగాంధీ.. మహిశాసురడట. అందుకే ఆయన తలను దుర్గామాత నరికివేసినట్లు మండపం ఏర్పాటు చేశారు. ఇది తీవ్ర చర్చకు దారి హోంమంత్రిత్వ శాఖ నుంచి ఒత్తిడి పెరగడంతో తొలగించనైతే తొలగించారు. కానీ, గాంధీని అసురడంటూ మంపడం ఏర్పాటు చేసిన నేతలు వ్యాఖ్యానించడం విశేషం. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‭కతాలో అఖిల భారత హిందూ మహాసభ వారు ఏర్పాటు చేసిన మండపం ఇది.

ఈ మండపం ఏర్పాటుపై అఖిల భారత హిందూ మహాసభ బెంగాల్ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రచూర్ గోస్వామి మాట్లాడుతూ ‘‘గాంధీలో మాకు అసలైన అసురుడు కనిపిస్తారు. అందుకే మేము దుర్గా మండపాన్ని ఇలా అలంకరించాం’’ అని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘కేంద్ర ప్రభుత్వం మహాత్మ గాంధీని ప్రమోట్ చేస్తోంది. అందుకే మేము ఆ విగ్రహాన్ని తొలగించి వేరేది మార్చాల్సి వచ్చింది. హోంమంత్రిత్వ శాఖ నుంచి మాపై ఒత్తిడి పెరిగింది. అందుకే గాంధీ ఎక్కడెక్కడ ఉన్నారో అవన్నీ తొలగించి స్వాతంత్ర్య సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి వారి ప్రతిమలు పెట్టాము’’ అని అన్నారు.

Dattatreya Hosabale: దేశంలో పెరుగుతోన్న నిరుద్యోగం, పేదరికంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఆర్ఎస్ఎస్

అయితే ఈ మండపం ఏర్పాటుపై సోషల్ మీడియా ద్వారా స్పందించిన ఒక జర్నలిస్టుకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారట. ఇలాంటివి షేర్ చేయడం వల్ల సమాజంలో ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందని పోలీసులు చెప్పడంతో సదరు జర్నలిస్ట్ తన ట్వీట్ డిలీట్ చేసుకున్నారు. విచిత్రంగా మండపం ఏర్పాటు చేసిన వారు.. గాంధీని అంతటి ప్రతికూలంగా చూపించినా, గాంధీని అసురుడంటూ దూషించినా స్పందించని పోలీసులు.. జర్నలిస్టుకు వార్నింగ్ ఇవ్వడం గమనార్హం.

ఇక ఈ మండపం ఏర్పాటుపై అధికార, విపక్షాల మధ్య రాజకీయ యుద్ధం కొనసాగుతోంది. జాతి పితను రాక్షసుడిలా చూపిస్తూ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. బీజేపీ అనుబంధ సంస్థలకు గాంధీని వ్యతిరేకంచడం అలవాటేనని, ఆర్ఎస్ఎస్ ఇప్పటికీ అదే వైఖరితో ఉంటుందని విమర్శిస్తున్నారు. కాగా, ఇది దేశాన్ని అవమానించడమని, బీజేపీ పరోక్షంగా ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తోందని టీఎంసీ నేత కునాల్ ఘోష్ అన్నారు.

Rahul Gandhi: ఒక్కరోజులోనే మఠం, మసీదు, చర్చి సందర్శించిన రాహుల్.. జోరుగా సాగుతున్న ‘భారత్ జోడో యాత్ర’