Tamil Nadu: అంబులెన్స్‭కు దారి ఇవ్వకపోతే ₹10,000 ఫైన్.. ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

అంబులెన్స్ కానీ ఫైర్ సర్వీస్ వాహనం కానీ.. మరే ఇతర అత్యవసర సేవల వాహనాలకైనా అడ్డు వస్తే గరిష్టంగా 10,000 రూపాయల వరకు జరిమానా విధించేలా ఆదేశాలు జారీ చేసింది. అలాగే అనవసరంగా హారన్లు కొట్టినా, నిషేదిత ప్రాంతాల్లో కనిపించినా 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయల వరకు జరిమానా విధించాలని రాష్ట్ర పోలీసు విభాగానికి ఆదేశించింది.

Tamil Nadu: అంబులెన్స్‭కు దారి ఇవ్వకపోతే ₹10,000 ఫైన్.. ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

Tamil Nadu: మన దేశంలోని ట్రాఫిక్ జాంల కారణంగా కొన్ని అత్యవసర సేవలకు అంతరాయం కలుగుతూ ఉంటుంది. అంబులెన్సులు, ఫైర్ సర్వీస్ వాహనాలు.. ఇలాంటి అత్యవసర సేవల వాహనాలు ట్రాఫిక్‭లో ఇరుక్కపోయి సరైన సమయంలో సేవలు అందించలేకపోతున్నాయి. దీని వల్ల ఆస్తి, ప్రాణ నష్టాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన ఫలితాల్ని ఇవ్వడం లేదు. అయితే దీనికి చెక్ పెట్టేందుకు తమిళనాడు ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. అత్యవసర వాహనాలకు ఇతర వాహనాలు అడ్డు రాకుండా ఉండేలా కొత్త ఆదేశాల్ని ఇచ్చింది.

ఎలాగంటే.. అంబులెన్స్ కానీ ఫైర్ సర్వీస్ వాహనం కానీ.. మరే ఇతర అత్యవసర సేవల వాహనాలకైనా అడ్డు వస్తే గరిష్టంగా 10,000 రూపాయల వరకు జరిమానా విధించేలా ఆదేశాలు జారీ చేసింది. అలాగే అనవసరంగా హారన్లు కొట్టినా, నిషేదిత ప్రాంతాల్లో కనిపించినా 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయల వరకు జరిమానా విధించాలని రాష్ట్ర పోలీసు విభాగానికి ఆదేశించింది.

Supriya Sule: ట్రాఫిక్ జాంలో ఇరుక్కున్న సుప్రియా సూలె.. కారు దిగి ఏం చేశారో తెలుసా?