CoronaVirus:కరోనాకు వాయు కాలుష్యానికి లింకేంటి ? 

కరోనా వైరస్ ఎలా వచ్చిందో ఎవరికీ తెలియడం లేదు. ఎలా సోకుతుందో అర్థం కావడం లేదు. ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని వైద్యులు వెల్లడిస్తున్నా..ఎలాంటి కాంటాక్ట్ లేని వారిలో కరోనా వైరస్ బయటప

CoronaVirus:కరోనాకు వాయు కాలుష్యానికి లింకేంటి ? 

CoronaVirus:కరోనా వైరస్ ఎలా వచ్చిందో ఎవరికీ తెలియడం లేదు. ఎలా సోకుతుందో అర్థం కావడం లేదు. ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని వైద్యులు వెల్లడిస్తున్నా..ఎలాంటి కాంటాక్ట్ లేని వారిలో కరోనా వైరస్ బయటపడుతుండడం అందర్నీ ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కరోనా వైరస్ కు వాయు కాలుష్యానికి లింక్ ఉందంటున్నారు పరిశోధకులు. వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్నచోట్ల ఈ రాకాసి ఉధృతమౌతోందని అధ్యయనం తేల్చింది. ఇటలీలోని బోలగ్న యూనివర్సిటీ, ట్రియస్టె యూనివర్సిటీ పరిశోధకులు సంయుక్తంగా అధ్యయనం నిర్వహించారు.

లంబార్డీలోని బెర్గామో పారిశ్రామిక ప్రాంతం నుంచి మూడు వారాల వ్యవధిలో సూక్ష్మ ధూళికణాల (PM 10)కు సంబంధించి 30 నమూనాలు సేకరించి పరిశీలించారు. భారీ స్థాయిలో ఉండే ధూళి కణాలకు కరోనా వైరస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిర్ధారించారు. లంబార్డీ ప్రాంతంలోనే కరోనా కేసులు అత్యధికంగా సంఖ్యలో నమోదయ్యాయి. ఈ ప్రాంతంలో గాలిలో సూక్ష్మ ధూళి కణాలు (PM 10) ఎక్కువగా ఉన్నాయని తేల్చారు.

సేమ్ లంబార్డీ ప్రాంతంలో ఉన్న పరిస్థితులే..ఢిల్లీలో కనిపించడం ఆందోళన వ్యక్తమౌతోంది. ఢిల్లీలో సూక్ష్మ ధూళికణాలు (PM 10) ప్రమాదకరస్థాయిలో ఉండడం, గతంలో వాయు కాలుష్య తీవ్రత కారణంగా ఢిల్లీలో 8 మంది చనిపోయారు. భారత వైద్య పరిశోధన మండలి (ICMR) 2018 డిసెంబర్ ఓ నివేదిక వెలువడించింది. కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.