కరోనా ఎలా వ్యాపిస్తుందో ఇటుకలతో చూపించిన చిన్నారులు.. పిల్లలు నేర్పిన పెద్ద పాఠమన్న మోడీ

ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. భారత్ సహా ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారిపై పోరాడుతున్నాయి. కరోనా నియంత్రణకు లాక్ డౌన్ ఆయుధాన్ని ప్రయోగిస్తున్నాయి.

కరోనా ఎలా వ్యాపిస్తుందో ఇటుకలతో చూపించిన చిన్నారులు.. పిల్లలు నేర్పిన పెద్ద పాఠమన్న మోడీ

ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. భారత్ సహా ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారిపై పోరాడుతున్నాయి. కరోనా నియంత్రణకు లాక్ డౌన్ ఆయుధాన్ని ప్రయోగిస్తున్నాయి. భారతదేశం కూడా కరోనాను కట్టడి చేసేందుకు మే 3 వరకు లాక్ డౌన్ పొడిగించింది. అందరూ ఇంట్లోనే ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను కోరారు. అయినా చాలామందికి లాక్ డౌన్‌పై నిబంధనలను ఉల్లంఘిస్తూ రోడ్లపైకి వస్తున్నారు. కరోనాపై అవగాహన కల్పించేందుకు మోడీ ఎన్నో సూచనలను ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

అయినప్పటికీ లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించి ఇళ్లను వదిలి బయటకు వస్తూనే ఉన్నారు. లాక్ డౌన్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కొందరు చిన్నారులు చేసిన ప్రయత్నం మోడీని ఆకట్టుకుంది. చిన్నారులకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన మోడీ.. ఎంతో మురిసిపోయారు… లాక్ డౌన్‌ ప్రాధాన్యత, కరోనా వ్యాప్తిని నియంత్రించాలంటే సామాజిక దూరం తప్పనిసరి అనే విషయాన్ని పిల్లలు ఎంతో చక్కగా చూపించారు.

ఇటుకలతో నిర్మించిన డొమినో ఎఫెక్ట్ ద్వారా కరోనా వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందో కళ్లకు కట్టినట్టుగా చూపించారు. నిలువుగా పేర్చిన ఇటుకల వరుసలో ముందు ఒక ఇటుకను మరో ఇటుకపై నెట్టగా.. అది ఒకదాని తరువాత మరొకటి వరుస క్రమంలో కూలిపోయాయి. కరోనా కూడా ఇలా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని చిన్నారులు ఇటుకల ద్వారా అవగాహన కల్పించారు. మరో ఇటుకల వరుసలో ఒక ఇటుకను తప్పించగా.. కొంతవరకే ఇటుక వరుస కూలింది. తర్వాతి ఇటుక నుంచి వరుస అలాగే ఉండిపోయింది.

అంటే.. లాక్ డౌన్ ద్వారా కరోనా చైన్ లింకును కట్ చేయడం ద్వారా వైరస్ వ్యాప్తిని ఇతరులకు సోకుండా అడ్డుకోవచ్చు.. ఇదే విషయాన్ని చిన్నారులు ఇటుకల ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. చిన్నారులు చేసిన ప్రయత్నం మోడీని ఎంతో ఆకట్టుకుంది. వారి నేర్పును చూసి మెచ్చుకున్న మోడీ.. పిల్లలు నేర్పిన పెద్ద పాఠం ఇదేనంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియోకు 2.1 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇవి కేవలం నెంబర్లు మాత్రమే. అదనంగా 49వేలు లైక్స్, 11వేల రీట్వీట్లు వచ్చాయి.

Also Read |  లాక్ డౌన్ పరిష్కారం కాదు…కరోనాకి అతిపెద్ద ఆయుధం అదే : రాహుల్