కరోనా పేషెంట్లకు ప్లాస్మా థెరీపీ పనిచేస్తుంది..కేజ్రీవాల్ కీలక నిర్ణయం

కరోనా పేషెంట్లకు ఫ్లాస్మా థెరపీ ప్రయోగం మంచి ఫలితాలనిస్తుందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. గడిచిన 4రోజులుగా ఢిల్లీలోని లోక్ నాయక్ జయ ప్రకాష్ నారాయణ్ హాస్పిటల్(LNJP) లో కరోనా వైరస్ సోకి ఆరోగ్యం విషమంగా ఉన్న 4గురు పేషెంట్లపై ఫ్లాస్మాధెరపీ ప్రయోగం చేశామని,ఇప్పటివరకు ఫలితాలు ఉత్సాహభరితంగా ఉన్నాయని ఇవాళ(ఏప్రిల్-24,2020) ఆప్ అధినేత తెలిపారు.

కరోనా పేషెంట్లకు ప్లాస్మా థెరీపీ పనిచేస్తుంది..కేజ్రీవాల్ కీలక నిర్ణయం

కరోనా పేషెంట్లకు ఫ్లాస్మా థెరపీ ప్రయోగం మంచి ఫలితాలనిస్తుందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. గడిచిన 4రోజులుగా ఢిల్లీలోని లోక్ నాయక్ జయ ప్రకాష్ నారాయణ్ హాస్పిటల్(LNJP) లో కరోనా వైరస్ సోకి ఆరోగ్యం విషమంగా ఉన్న 4గురు పేషెంట్లపై ఫ్లాస్మాధెరపీ ప్రయోగం చేశామని,ఇప్పటివరకు ఫలితాలు ఉత్సాహభరితంగా ఉన్నాయని ఇవాళ(ఏప్రిల్-24,2020) ఆప్ అధినేత తెలిపారు. LNJP హాస్పిటల్ లో సీరియస్ పేషెంట్లపై ప్లాస్మా థెరపీ పరిమిత ట్రయిల్స్ కు మాత్రమే కేంద్రం తమకు అనుమతిచ్చిందని కేజ్రీవాల్ తెలిపారు. తాము మరిన్ని ట్రయిల్స్ ను నిర్వహిస్తామని, అప్పుడు ప్లాస్మాథెరపీని సీరియస్ పేషెంట్లు అందరికోసం ఉపయోగించేలా వచ్చే వారం తాము పర్మీషన్ కోరుతామని కేజ్రీవాల్ తెలిపారు. కరోనా సోకి కోలుకున్నవాళ్లకు బ్లడ్ ప్లాస్మా దానం చేయాలని ఈ సందర్భంగా కేజ్రీవాల్ విజ్ణప్తి చేశారు.

4గురు పేషెంట్లలో పాజిటివ్ ఫలితాలు రావడంతో తాము సంతోషంగా ఉన్నామని, LNJP హాస్పిటలో ఉన్న మరో 2-3 కరోనా పేషెంట్లకు బ్లడ్&ప్లాస్మా రెడీగా ఉన్నట్లు, ఇవాళ వారికి ప్లాస్మా థెరపీ తాము ఇవ్వనున్నట్లు ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్స్ డైరక్టర్ డాక్టర్ ఎస్ కే సరిన్ తెలిపారు. ఈ సమయంలో కరోనా నుంచి కోలుకుని ఇళ్లల్లో ఉన్నవాళ్లు అవసరమని,వాళ్లు తమ దేశభక్తిని చూపించడం మరియు బ్లడ్ ప్లాస్మాను దానం చేయడం మనకు అవసరమని డాక్టర్ సరిన్ తెలిపారు. ప్లాస్మా థెరపీ క్లినికల్ ట్రయిల్స్ కు ఐసీఎంఆర్ అనుమతిచ్చిన తర్వాత…కేరళ,గుజరాత్,పంజాబ్ సహా పలు రాష్ట్రాలు ఇప్పటికే ఆరోగ్యం విషమంగా ఉన్న కరోనా పేషెంట్ల కొరకు ప్లాస్మా థెరపీని ఉపయోగించడం ప్రారంభించిన విషయం తెలిసిందే.

ప్లాస్మాథెరపీ అంటే ఏమిటి?
ప్లాస్మా థెర‌పీలో… క‌రోనా సోకి కోలుకున్న వ్యక్తి శ‌రీరం నుంచి ర‌క్తాన్ని సేక‌రించి.. అందులో ఉండే ప్లాస్మాను వేరు చేస్తారు. ఆ ప్లాస్మాను ప్రాణాపాయ స్థితిలో ఉన్న క‌రోనా రోగి ర‌క్తంలోకి ఎక్కిస్తారు. దీంతో 2 రోజుల్లోనే ఆ రోగి సాధార‌ణ స్థితికి చేరుకుంటాడు. ఈ క్ర‌మంలో క‌రోనా వ‌చ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా.. ఈ విధానం ద్వారా రోగుల‌ను బ‌తికించేందుకు అవ‌కాశం ఉంటుంది.

అయితే ప్లాస్మా థెర‌పీలో ఒక వ్య‌క్తి నుంచి సేక‌రించే ప్లాస్మాతో రెండు డోసులు మాత్ర‌మే త‌యారు చేయ‌వ‌చ్చ‌ని ICMR తెలియ‌జేసింది. ఒక డోసు వ్య‌క్తికి స‌రిపోతుంద‌ని.. అయితే ప్లాస్మాను సేక‌రించేందుకు క‌రోనా సోకి కోలుకున్న వ్యక్తి వారిని ఒప్పించాల్సి ఉంటుంద‌ని.. ICMR తెలిపింది. ఇక అమెరికా, చైనాల‌లో ఇప్పటికే ఈ విధానం స‌క్సెస్ అయినందున‌.. మ‌న దేశంలోనూ దీన్ని ప్ర‌స్తుతం ప్రారంభించారు. అయితే ఈ విధానం చాలా ఖ‌ర్చుతో కూడుకున్న‌ది క‌నుక‌.. కేవ‌లం అత్య‌వ‌సర స్థితి ఉన్న క‌రోనా పేషెంట్ల‌కు మాత్ర‌మే ఈ విధానంలో చికిత్స చేయ‌నున్నారు.